మరికాసేపట్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ, రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం

Telangana CM KCR to Chair Cabinet Meeting Today to Discuss and Approve State Budget,Telangana Cabinet Meeting, Cm Kcr Chairmanship,Cm Kcr Cabinet Meeting,Cm Kcr Telangana Cabinet Meeting,Telangana Parliment Meeting,Telangana Meeting Cabinet,Mango News,Mango News Telugu,Cm Kcr News And Live Updates, Telangna Congress Party, Telangna Bjp Party, Ysrtp,Trs Party, Brs Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మరికాసేపట్లో రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఈరోజు (ఫిబ్రవరి 5, ఆదివారం) ఉదయం 10.30 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ కేబినెట్ సమావేశం సందర్భంగా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ 2023-24 పై కేబినెట్ కీలకంగా చర్చించి, ఆమోదం తెలుపనుంది. ఇక కేబినెట్ స‌మావేశం ముగిసిన అనంత‌రం సీఎం కేసీఆర్ పలువురు నేతలతో కలిసి నాందేడ్ కు వెళ్లనున్నారు. ఆదివారం సాయంత్రం నాందేడ్ లో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రెండవ భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

మరోవైపు 2023-24 సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ ను ఫిబ్రవరి 6, సోమవారం నాడు శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి టీ.హరీశ్ రావు శాసనసభలో, రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శాసనమండలిలో బడ్జెట్‌ ను ప్రవేశపెట్టనున్నారు. 7వ తేదీన అసెంబ్లీకి సెలవు ప్రకటించగా, 8వ తేదీన ఉభయసభల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. అలాగే 9,10, 11 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చిస్తారు. ఇక ఫిబ్రవరి 12వ తేదీన ద్రవ్య వినిమయబిల్లుపై చర్చ జరగనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two − one =