తెలంగాణలో కొత్తగా 1006 కరోనా కేసులు, రికవరీ రేటు 96.52 శాతం

Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases,mango news

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 1006 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జూన్ 20, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,13,202 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 1798 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 5,91,870 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 96.52 శాతంగా ఉంది.

ఇక కరోనా వలన రాష్ట్రంలో మరో 11 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 3567 కి పెరిగింది. కాగా మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,765 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 141, ఖమ్మంలో 88, రంగారెడ్డిలో 79, సూర్యాపేటలో 68, నల్గొండలో 64, కరీంనగర్ లో 62, మేడ్చల్-మల్కాజ్ గిరిలో 58, భద్రాద్రి కొత్తగూడెంలో 50, నమోదయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 13 =