కలెక్టరేట్ కాంప్లెక్సులు, ధరణి, మెడికల్ కాలేజీల భూకేటాయింపుపై కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు

CS Somesh Kumar, CS Somesh Kumar held Review with District Collectors, CS Somesh Kumar Video Conference with District Collectors, Mango News, Telangana CS, Telangana CS held a Video Conference, Telangana CS held a Video Conference with District Collectors, Telangana CS Somesh Kumar, Telangana CS Somesh Kumar Meeting, Telangana CS Video Conference with District Collectors, Telangana CS Video Conference with District Collectors Senior Officials

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కుమార్ శనివారం నాడు జిల్లా కలెక్టర్లు, సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కలెక్టరేట్ కాంప్లెక్సెస్ నిర్మాణాల పూర్తి, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్, నూతన మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలకు భూముల బదలాయింపు, ధరణికి సంబంధించిన విషయాలపై సీఎస్ చర్చించి కీలక ఆదేశాలు ఇచ్చారు. 12 జిల్లాల్లో కలెక్టరేట్ కాంప్లెక్సులను వారంలోగా పూర్తి చేసి ప్రారంభించడానికి సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇక మిగతా జిల్లాల్లో కూడా కలెక్టరేట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు.

మరోవైపు స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల నిర్మాణంకోసం టీఎస్ఐఐసీకి భూములు హ్యాండ్ ఓవర్ చేసేలా చర్యలు ప్రారంభించాలన్నారు. ప్రభుత్వం ఇటీవల 7 జిల్లాలలో మంజూరు చేసిన నూతన మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం కూడా గుర్తించిన భూమి కేటాయింపు ప్రక్రియను ప్రారంభించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. ధరణిలో పెండింగ్ మ్యుటేషన్లు, భూవిషయాలకు సంబంధించిన గ్రీవియన్స్ మాడ్యూల్, ప్రొహిబిటరీ ప్రాపర్టీలలో సమర్పించిన ధరఖాస్తుల పరిష్కార పురోగతిని సమీక్షించి జూన్ 9 లోగా పరిష్కరించి తద్వారా, ఆ రైతులు రైతుబంధు సహాయం పొందేలా చూడాలని ఆదేశించారు. అలాగే స్పెషల్ ట్రిబ్యునల్ లో పెండింగ్ కేసులకు సంబంధించి హియరింగ్ లను నిర్వహించాలని కలెక్టర్లకు సీఎస్ సోమేశ్ కుమార్ సూచించారు.

ఈ వీడియోకాన్ఫరెన్స్ లో రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సి.ఐ.జి వి.శేషాద్రి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, ఎస్సీడిడి సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, డైరెక్టర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సయిజ్ సర్ఫరాజ్ అహ్మద్, టీఎస్టీఎస్ ఎండీ వెంకటేశ్వర్ రావు, సీసీఎల్ఏ స్పెషల్ ఆఫీసర్ సత్యశారద, ఈఎన్సీ గణపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − seven =