రాష్ట్రంలో రైతులకు అధిక ఆదాయం లభించేలా సింగిల్ పిక్ కాటన్ సాగుకై ప్రోత్సాహం – సీఎస్ సోమేశ్ కుమార్

Telangana CS Somesh Kumar Held Meeting to Discuss Proposed Action Plan on Promote Single Pick Cotton, CS Somesh Kumar Held Meeting to Discuss Proposed Action Plan on Promote Single Pick Cotton, Somesh Kumar Held Meeting to Discuss Proposed Action Plan on Promote Single Pick Cotton, Proposed Action Plan on Promote Single Pick Cotton, Action Plan on Promote Single Pick Cotton, Single Pick Cotton, Somesh Kumar Chief Secretary held a meeting to discuss the proposed action plan on promotion of single pick Cotton, IAS Somesh Kumar held a meeting to discuss the proposed action plan on promotion of single pick Cotton, promotion of single pick Cotton, Telangana CS Somesh Kumar, Telangana Chief Secretary Somesh Kumar, Chief Secretary Somesh Kumar, CS Somesh Kumar, single pick Cotton News, single pick Cotton Latest News, single pick Cotton Latest Updates, single pick Cotton Live Updates, Mango News, Mango News Telugu,

రాష్ట్రంలో రైతులకు అధిక ఉత్పాదకత, లాభసాటిగా ఉండేందుకు సింగిల్ పిక్ కాటన్ ప్రమోషన్‌ పై ప్రతిపాదిత కార్యాచరణ ప్రణాళికపై చర్చించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం బీఆర్ కేఆర్ భవన్లో సమావేశం నిర్వహించారు. ఉత్పాదకతను పెంపొందించడంతో పాటు రాష్ట్రంలోని రైతులకు అధిక ఆదాయం లభించేలా సింగిల్‌ పిక్ పత్తిని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. సింగిల్ పిక్ పత్తి 40 శాతం అధిక దిగుబడిని అందిస్తుందనీ పలు దేశాలు కూడా ఈ రకమైన పత్తిని పంటను వేస్తున్నారని వివరించారు. ఈ పత్తి సాగుకు సరిపడా విత్తనం అందుబాటులో ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో సింగిల్‌ పిక్‌ పత్తి సాగు చేయించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. గతంలో విత్తన కంపెనీల ద్వారా ట్రయల్స్‌ నిర్వహించిన ప్రాంతాల్లో పత్తి ఏరియా విస్తరణను చేపట్టాలని అన్నారు. ఈ సింగిల్ పిక్ పత్తి వేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన జిల్లాలు, మండలాలు, గ్రామాలలో రైతులను చైతన్య పర్చాలని సూచించారు.

హెచ్‌డిపిఎస్ (హై-డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టం) టెక్నాలజీని ప్రోత్సహించేందుకు విత్తన కంపెనీల సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ విస్తరణ అధికారుల సమావేశం నిర్వహించి, ఈ సింగిల్ పిక్ పత్తిని సాగు చేసే రైతులను నమోదు చేయించాలని ఆదేశించారు. దీనికై రైతు ప్రొఫైల్‌, వర్షపాతం వివరాలు, పంటల క్యాలెండర్‌ తదితర వివరాలతో కూడిన యాప్‌ను రూపొందించాలని సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్యదర్శి ఎం రఘునందన్‌ రావు, పీజేటీఎస్‌ఏయూ వీసీ ప్రవీణ్‌రావు, స్పెషల్ కమిషనర్ అగ్రికల్చర్ హనుమాన్ కె జెండగే, హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =