ఆయిల్ పామ్ రైతుల కోసం ప్రత్యేక మొబైల్ యాప్, సీఎస్ సోమేశ్ కుమార్ కీలక సమీక్ష

Telangana CS Somesh Kumar held Review Meeting on Oil Palm Cultivation with Officials, CS Somesh Kumar held Review Meeting on Oil Palm Cultivation with Officials, Telangana CS Somesh Kumar held Review Meeting with Officials On Oil Palm Cultivation, CS Somesh Kumar held Review Meeting, CS Somesh Kumar held Review Meeting on Oil Palm Cultivation, Review Meeting On Oil Palm Cultivation, Telangana CS Somesh Kumar, Chief Secretary Somesh Kumar, Telangana Chief Secretary Somesh Kumar, Telangana Chief Secretary, Oil Palm Cultivation, Palm Oil Cultivation, Telangana Palm Oil Cultivation, Palm Oil Cultivation News, Palm Oil Cultivation Latest News, Palm Oil Cultivation Latest Updates, Palm Oil Cultivation Live Updates, Mango News, Mango News Telugu,

రాష్ట్రంలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ చేపట్టే రైతులకు మరింత విస్తృత సమాచారం అందించేందుకుగానూ ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఐదు లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ను చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం నిర్దేశించిన నేపథ్యంలో గురువారం ఆర్థిక, వ్యవసాయ, పరిశ్రమలు, ఉద్యానవనశాఖ అధికారులతో సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఈ ఏడాది 1,85,000 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ తోటలను చేపట్టేందుకు ఏర్పాట్లు చేశామని, అలాగే 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ ప్లాంటేషన్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇది రైతులకు 4 నుంచి 5 రెట్లు లాభదాయకంగా ఉంటుందని అన్నారు. ఆయిల్ పామ్ పెంపుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వెయ్యి కోట్ల రూపాయలను బడ్జెట్ లో ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ తోటలను పెంచేందుకు భూములు అనుకూలంగా ఉన్నాయని సీఎస్ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఆయిల్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డైరెక్టర్ అఖీల్, ఉద్యానవన శాఖ సంచాలకులు వెంకట్రామ్ రెడ్డి లు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 12 =