రక్షణ భూముల కేటాయింపు, ఉపాధిహామీ నిధుల చెల్లింపుపై కేంద్ర కార్యదర్శులతో సమావేశమైన సీఎస్ సోమేశ్ కుమార్

Telangana CS Somesh Kumar Meets Union Defence Secretary A Giridhar in New Delhi,Telangana CS Somesh Kumar,Union Defence Secretary A Giridhar,Somesh Kumar Meets A Giridhar,Mango News,Mango News Telugu,Giridhar Aramane,Defence Secretary Of India 2022,Secretary Of Defence India,Ajay Kumar Defence Secretary,Secretary Defence Production,Giridhar Aramane Wikipedia,Defence Secretary Of India List,Home Secretary Of India,Ajay Kumar, Defence Secretary,Union Defence Secretary,Giridhar Aramane Secretary Dpiit,Union Defence Minister,Union Defence Minister Of India

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ గురువారం న్యూఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి ఎ.గిరిధర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానంగా రక్షణ భూములకు సంబంధించి దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై కేంద్రరక్షణ కార్యదర్శితో సీఎస్ చర్చించారు. ఏఓసీ రోడ్ల మూసివేతకు బదులుగా ఏఓసీ పరిధిలో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి రక్షణ శాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని సీఎస్ కోరారు. మెహిదీపట్నంలో స్కై వాక్ నిర్మాణానికి కూడా అనుమతి ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, లింక్ రోడ్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ కోసం కావాల్సిన రక్షణ శాఖ భూముల కేటాయింపు అంశాలను కేంద్ర రక్షణ కార్యదర్శి దృష్టికి సీఎస్ సోమేశ్ కుమార్ తీసుకెళ్లారు.

అనంతరం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శైలేష్‌ కె సింగ్‌తో సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశమై జాతీయ ఉపాధి హామీ పధకం క్రింద చెల్లింపు సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్రంలో వరి అత్యంత ప్రధానమైన పంట అని, వరికోతల అనంతరం రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు మేలుచేసేందుకై రైతు కళ్లాలను ప్రభుత్వం నిర్మించిందని కేంద్ర కార్యదర్శికి సీఎస్ సోమేశ్ కుమార్ వివరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here