రేపు పశ్చిమబెంగాల్ లో ప్రధాని మోదీ పర్యటన, వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

PM Modi will visit West Bengal Tomorrow Will Flag Off Vande Bharat Express Connecting Howrah to New Jalpaiguri,PM Modi will visit West Bengal,Flag Off Vande Bharat Express,Howrah to New Jalpaiguri,Mango News,Mango News Telugu,Vande Bharat Express Route,Vande Bharat Express Price,Vande Bharat Express Timing,Vande Bharat Express Speed,75 New Vande Bharat Express Route,Vande Bharat Express Booking,Vande Bharat Express Route In Gujarat,Vande Bharat Express Ahmedabad To Mumbai,Vande Bharat Express Ticket Price,Vande Bharat Express Delhi To Katra,Vande Bharat Express Train Accident,Vande Bharat Express Train,Vande Bharat Express Chennai To Mysore,Vande Bharat Express Bangalore,New Vande Bharat Express,How Many Vande Bharat Express In India

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ రేపు (డిసెంబ‌ర్ 30, శుక్రవారం) ప‌శ్చిమబెంగాల్‌ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో రూ.7800 కోట్ల కంటే ఎక్కువ విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముందుగా గురువారం ఉదయం ప్రధాని మోదీ హౌరా రైల్వే స్టేష‌న్‌కి చేరుకుని, హౌరా నుండి న్యూ జల్‌పాయిగురిని వరకు నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ని జెండా ఊపి ప్రారంభించనున్నారు. కోల్‌కతా మెట్రో యొక్క పర్పుల్ లైన్ జోకా-తరటాలా స్ట్రెచ్‌ను కూడా ప్రధాని ప్రారంభిస్తారు మరియు వివిధ రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

మధ్యాహ్నం 12 గంటలకు ఐఎన్ఎస్ నేతాజీ సుభాష్ కు ప్రధాని చేరుకుని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు మరియు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాటర్ అండ్ శానిటేషన్ ని ప్రారంభిస్తారు. అనంతరం జాతీయ మిషన్ ఫర్ క్లీన్ గంగా కింద పశ్చిమ బెంగాల్ లో పలు మురుగునీటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో చేసి, కొన్నింటిని జాతికి అంకితం చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 12:25 గంటలకు కోల్ కతాలో ప్రధాని మోదీ అధ్యక్షతన జాతీయ గంగా కౌన్సిల్ రెండవ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కౌన్సిల్‌లో సభ్యులుగా ఉన్న ఇతర కేంద్రమంత్రులు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. గంగా నది మరియు దాని ఉపనదుల కాలుష్య నివారణ మరియు పునరుజ్జీవనం యొక్క పర్యవేక్షణ పూర్తిగా జాతీయ గంగా కౌన్సిల్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − seven =