స్థానికసంస్థల్లో 100శాతం ఆడిట్‌, వరసగా రెండోసారి నేషనల్ లీడ్ స్టేట్ గా నిలిచిన తెలంగాణ

Telangana Gets First Place in the Country for Second Consecutive Year for Achieving 100% Audit in Local Bodies,Mango News,Mango News Telugu,Telangana,Telangana News,Telangana Latest News,Telangana Live News,Telangana News Today,Telangana Latest Updates,Telangana Live Updates,100% Audit in Local Bodies,Telangana Is Lead State For Audit Online Nationwide,Audit Online,Audit,National Lead State,Telangana Is Number One In The Country In Local Body Auditing,Local Body Auditing,Minister Errabelli Dayakar Rao,Minister Ktr Telangana,Telangana National Lead State,Telangana Gets First Place in the Country

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంచాయితీరాజ్ శాఖ ఆడిటింగ్ లో దేశంలో మరోసారి మొదటి స్థానాన్ని తెలంగాణ రాష్ట్రం కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా మొదటి స్థానం రావడం పట్ల రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును, వారి టీమ్ ను ట్విట్టర్ వేదికగా అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 540 మండలాలు, 32 జిల్లా పరిషత్ లు ఉన్న తెలంగాణ రాష్ట్రం వరసగా రెండో సారి “నేషనల్ లీడ్ స్టేట్” గా నిలవడం గర్వించతగ్గ విషయం అన్నారు.

దేశంలో 100 శాతం ఆడిట్ సాధించిన మొదటి రాష్ట్రంగా ఉండటం వెనుక రాష్ట్ర అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కృషి ఉందన్నారు. దేశంలోనే ఆడిటింగ్ లో మొదటి స్థానం రావడానికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో అధికారులు బాగా పనిచేశారని అన్నారు. ట్విట్టర్ వేదికగా అభినందించిన మంత్రి కేటీఆర్ కు మంత్రి ఎర్రబెల్లి ధన్యవాదాలు తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ర్యాంకులు, అవార్డులు ఇచ్చినట్లే నిధులు కూడా ఇవ్వాలని అన్నారు. ఈ ర్యాంకు రావడానికి కృషి చేసిన గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పనిచేసిన అధికారులు, ఉద్యోగులకు, సిబ్బందికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందనలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − six =