తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రద్దు, మార్కులపై కమిటీ ఏర్పాటు

cancellation of Inter 2nd year exams, Mango News, Telangana Cancelled Intermediate Second Year Exams, Telangana Govt Cancelled Intermediate Second Year Exams, Telangana Inter second year exams, Telangana Inter second year exams cancel news, Telangana Inter second year exams cancelled, Telangana Inter second year exams news, Telangana Intermediate Second Year Exams, Telangana Intermediate Second Year Exams 2021, Telangana Intermediate Second Year Exams 2021 Canceled, TS Inter 2nd year Exam 2021, TSBIE Telangana board class 12 exam

రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలకు అనుగుణంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళన నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి నెలకొనకుండా ఉండేందుకు పరీక్షల రద్దుకు ప్రభుత్వం మొగ్గు చూపిందని మంత్రి తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని చెప్పారు. మార్కులకు సంబంధించి అధికారులతో కూడిన కమిటీని నియమించి, విధి విధానాలను రూపొందించి ఫలితాలను ప్రకటిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను పరీక్షలు లేకుండానే పైతరగతికి ప్రమోట్‌ చేస్తునట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =