గవర్నర్ తమిళిసై వ్యవహారంపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం

Telangana Govt Files Writ Petition In Supreme Court Against Governor Tamilisai Soundarajan,Telangana Govt Files Writ Petition In Supreme Court, Telangana Govt Files Petition Against Governor,Telangana Govt Against Governor Tamilisai Soundarajan,Mango News,Mango News Telugu,Telangana Live News,Telangana Latest News And Updates,Telangana Governor Tamilisai Soundararajan,Tamilisai Soundararajan Qualification,Governor Of Telangana 2023,Governor Dr.Tamilisai Soundararajan,Telangana Political News And Updates

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌందరరాజన్‌ వ్య‌వ‌హారంపై రాష్ట్ర‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. తన వద్ద ఇంకా పెండింగ్‌లో ఉన్న పది కీలక బిల్లులను ఆమోదించేలా గవర్నర్ తమిళిసైను ఆదేశించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి సుప్రీంకోర్టులో రిట్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. సెప్టెంబ‌ర్ నుంచి 7 బిల్లులు, గ‌త నెల నుంచి 3 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని ప్ర‌భుత్వం తెలిపింది. కాగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిష‌న్ రేపు సుప్రీంలో విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇక ఈ పిటిష‌న్‌లో ప్ర‌తివాదిగా గవర్నర్‌ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ పేరును పేర్కొన్నారు. కాగా గవర్నర్‌ త‌మిళిసై ఉద్దేశపూర్వకంగానే వాటిని ఆమోదించడం లేదని, వాటిలో కొన్ని రాష్ట్ర వ్యవహారాల పనితీరుకు ముఖ్యమైనవి అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక రాజ్‌భవన్‌లో ఆరు నెలలకు పైగా పెండింగ్‌లో ఉన్న కొన్ని బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించకపోవడంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లు సమాచారం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 3 =