పద్మ భూషణ్ పుర‌స్కారాన్ని అందుకున్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, భారత ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు

Google Alphabet CEO Sundar Pichai Says It was an Immense Honour to Receive the Padma Bhushan Award,Google CEO Sundar Pichai, Padma Bhushan Award,Thanked Government And People Of India,Sundar Pichai Padma Bhushan Award,Padma Bhushan Award Received By Sundar Pichai,Mango News,Mango News Telugu,Google CEO,Sundar Pichai,Google CEO Sundar Pichai Latest News And Updates,Padma Bhushan Sundar Pichai,Sundar Pichai Padma Bhushan,Padma Bhushan Sundar Pichai Latest News,Latest News,Google Latest News,Google Latest Updates

గూగుల్, ఆల్ఫాబెట్ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) సుందర్ పిచాయ్ కు కేంద్ర ప్రభుత్వం 2022 గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారమైన “పద్మ భూషణ్” ను ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతీయ సంతతికి చెందిన సుందర్ పిచాయ్ 2015, ఆగస్టులో గూగుల్ సీఈవో కాగా, 2019, డిసెంబర్ లో గూగుల్ యొక్క మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌కి కూడా సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ పుర‌స్కారాన్ని సుందర్ పిచాయ్ తాజాగా అందుకున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) లోని భారత రాయబారి తరణ్​జిత్ సింగ్ సంధూ శుక్రవారం సుందర్ పిచాయ్​ కు పద్మ భూషణ్ పుర‌స్కారాన్ని పురస్కారాన్ని అందించారు.

తరణ్​జిత్ సింగ్ సంధూ ట్వీట్ చేస్తూ, శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ కి పద్మభూషణ్ అందజేయడం ఆనందంగా ఉంది. సుందర్ యొక్క మధురై నుండి మౌంటెన్ వ్యూ వరకు సాగిన స్ఫూర్తిదాయకమైన ప్రయాణం, భారతదేశం, అమెరికా ఆర్థిక మరియు సాంకేతికతను బలోపేతం చేసింది. అలాగే సంబంధాలు, ప్రపంచ ఆవిష్కరణలకు భారతీయ ప్రతిభావంతుల సహకారాన్ని పునరుద్ఘాటించింది” అని పేర్కొన్నారు.

సుందర్ పిచాయ్ మాట్లాడుతూ, భారత రాయబారి తరణ్​జిత్ సింగ్ సంధూకు ధన్యవాదాలు తెలిపారు. పద్మభూషణ్‌ను అందుకోవడం, ఈ సమయంలో ఈరోజు తన కుటుంబం అక్కడ తనతో ఉండడం గొప్ప గౌరవంమని అన్నారు. భారత ప్రభుత్వానికి మరియు భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే భారతీయత ఎప్పటికీ తనతో పాటే ఉంటుందని, భారతీయత తనలో భాగమని, ఎక్కడికి వెళ్లినా తన వెంట తీసుకెళ్తానని ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here