తెలంగాణలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Implementation of 10 Percent EWS Reservations, Mango News, Telangana approves 33.3 per cent reservation for women, Telangana gives 33.3 per cent reservation for women under EWS quota, Telangana Government Issues Order For 10% Reservation, Telangana Govt, Telangana Govt Issued Orders Over Implementation of 10 Percent EWS Reservations, Telangana Govt Issued Orders Over Implementation of 10 Percent EWS Reservations in the State, Telangana issues GO to implement 10% EWS quota, TS govt issues order to implement 10 per cent reservations

తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ప్రభుత్వ నియామకాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో రూ.8 లక్షల ల్లోపు వార్షికాదాయం ఉన్న వారికి ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు వర్తింపు చేయనున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు వర్తించని వారికి కూడా ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు వర్తించనున్నాయి. ఈ రిజర్వేషన్లకు ఆదాయ ధ్రువపత్రం ఆధారంగా అర్హతను నిర్ణయించనున్నారు. ఒకవేళ ధ్రువపత్రం తప్పుగా తేలితే సర్వీసు రద్దు, చట్టపరమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్‌ కోటాలో భర్తీ కాకపోతే తదుపరి ఏడాదికి ఆ ఖాళీలను బదిలీ చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 19 =