వాట్సాప్‌ ద్వారా కోవిడ్-19 వ్యాక్సిన్‌ స్లాట్‌ బుక్ చేసుకునే విధానం ఇదే…

COVID-19 vaccination slot via WhatsApp, Covid-19 Vaccination Slots, Covid-19 Vaccination Slots Can Book Now Through Whatsapp, Covid-19 vaccination slots can now be booked on WhatsApp, COVID-19 vaccine slot via WhatsApp, COVID-19 vaccine slots can now be booked on WhatsApp, How to book Covid vaccine appointment via WhatsApp, How to book COVID-19 vaccination slot via WhatsApp, how to book COVID-19 vaccine slot using WhatsApp, Mango News

దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వేయించుకునేందుకు స్లాట్ బుకింగ్ పక్రియను మరింత సులభతరం చేసేలా కేంద్రం మరో విధానాన్ని అమల్లోకి తెచ్చింది. కొత్తగా నిమిషాల్లోనే వాట్సాప్ ద్వారా కోవిడ్-19 వ్యాక్సిన్ స్లాట్స్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. వాట్సాప్ లో సులభంగా MyGov కరోనా హెల్ప్‌డెస్క్ ద్వారా వ్యాక్సిన్ తీసుకునేందుకు స్లాట్ బుక్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. మరోవైపు ఇటీవలే వాట్సాప్ ద్వారా కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కూడా కేంద్రం అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

వాట్సాప్ ద్వారా కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం స్లాట్ బుక్ చేసుకునే విధానం:

  • ముందుగా MyGov కరోనా హెల్ప్‌డెస్క్ కాంటాక్ట్ నంబర్‌ +91 9013151515 మొబైల్ లో సేవ్ చేసుకోవాలి.
  • ఈ నెంబర్ కు వాట్సాప్ లో ”Book Slot” అని టైప్ చేసి మెసేజ్ పంపించాలి.
  • మొబైల్ నంబర్ కి వచ్చిన ఆరు అంకెల ఓటీపీ నంబర్ ఎంటర్ చేయాలి.
  • అనంతరం వ్యాక్సిన్ తీసుకోదలిచిన తేదీ, వ్యాక్సినేషన్ సెంటర్ లొకేషన్, పిన్ కోడ్, ఏ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటున్నారు అనే వివరాలను సెలెక్ట్ చేసుకోవాలి.
  • వివరాలను పూర్తి చేసిన తర్వాత కోవిడ్-19 వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్ పై నిర్ధారణ సందేశం మొబైల్ కు వస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 10 =