తెలంగాణలో రూ.340 కోట్ల వ్యయంతో కోటికిపైగా బతుకమ్మ చీరలు పంపిణీకి సిద్ధం

Telangana Govt Readies More than 1 Cr Bathukamma Sarees for Distribution at a Cost of Rs 340 Cr, Govt To Distribute 1.18 Crore Bathukamma Sarees, Telangana Govt Readies More than 1 Cr Bathukamma Sarees, Bathukamma Sarees Distribution, Bathukamma Sarees, Mango News, Mango News Telugu, Telangana Govt Bathukamma Sarees, Telangana Govt Bathukamma Sarees Distribution, Bathukamma Celebration, Telangana Bathukamma Celebration, Telangana Govt Bathukamma Sarees Distribution, Bathukamma Latest News And Updates, Telangana Govt News And Live Updates

తెలంగాణ రాష్ట్రంలో జరిగే బతుకమ్మ పండుగ ఉత్సవాలు ప్రపంచ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచాయి. మహిళలు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటుండగా, మహిళ సోదరీమణుల సంతృప్తి కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రతి ఏడాది కోట్ల వ్యయం ఉన్నప్పటికీ ఈ ఉత్సవాలు ఘనంగా జరిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు పంపిణీని చేసేందుకు బతుకమ్మ చీరలు సిద్ధమయ్యాయి. బతుకమ్మ చీరలు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేస్తుంది. రంగు రంగుల వన్నెల్లో, కలర్ ఫుల్ రంగులతో సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్ తదితర ప్రాంతాల్లో నేతన్నలతో నేయించి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మహిళలకు భారీ స్థాయిలో పంపిణీ చేయిస్తున్నారు.

ఈ ఏడాది 340 కోట్ల వ్యయంతో 30 రకాల రంగులు, 800 కలర్ కాంబినేషన్స్, 240 పైచిలుకు వెరైటీ డిజైనర్ లతో బతుకమ్మ చీరలు తయారుచేసి పంపిణీకి సిద్ధం చేశారు. మొత్తం ఒక కోటి 18 లక్షల చీరలు మహిళలకు పంపిణీ చేయడానికి టెస్కో, తెలంగాణ హ్యాండ్లూమ్స్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ సంవత్సరం బతుకమ్మ చీరలు వెండి, బంగారు, జరీ అంచులతో తయారు చేయించారు. సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు ప్రభుత్వం, రాష్ట్ర అవతరణ తర్వాత ప్రతి బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు రంగు రంగుల డిజైనలలో చీరలు పంపిణీ చేయిస్తున్నారు. త్వరలోనే బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం వివరాలను సంబంధిత శాఖ వెల్లడించనుంది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here