ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కనకమామిడిలోని ఫామ్ హౌస్ లో నేడు కృష్ణంరాజు అంత్యక్రియలు

Actor Krishnam Raju Last Rites will be held at Kanaka Mamidi Farm House Near Moinabad at 1 PM Today, Krishnam Raju Last Rites at Kanaka Mamidi Farm House, ctor and Former Union Minister Krishnam Raju, Krishnam Raju Died, Celebrities Pays Tribute To Krishnam Raju, Megastar Chiranjeevi , Super Star Mahesh Babu, Rebel Star Krishnam Raju, Mango News, Mango News Telugu, Senior Actor Krishnam Raju, Telugu Senior Actor Krishnam Raju, Krishnam Raju Passes Away, Krishnam Raju Dies At 83, Krishnam Raju Died, Tollywood Latest News, Krishnam Raju Last Rites

ప్రముఖ సీనియర్ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు అంత్యక్రియలను నేడు (సెప్టెంబర్ 12, సోమవారం) చేవెళ్ల, మొయినాబాద్ దగ్గరలోని కనక మామిడి ఫామ్ హౌస్ లో నిర్వహించనున్నారు. ఈ మేరకు కృష్ణంరాజు కుటుంబ సభ్యులు ఒక ప్రకటన చేశారు. అంతిమయాత్రలో భాగంగా కృష్ణంరాజు పార్థివదేహం జూబ్లీహిల్స్, రోడ్ నెంబర్ 28 లోని ఇంటినుండి మధ్యాహ్నం బయలుదేరనుంది.

ఇక ఆదివారం ఉదయం నుంచి కృష్ణంరాజు పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, సన్నిహితులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కృష్ణంరాజుకు నివాళి అర్పించి, ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రముఖ హీరోలు, దర్శకులు, నిర్మాతలు సహా ఇతర సినిమా టెక్నీషియన్స్ కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళులు అర్పించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. కృష్ణంరాజు మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు.

ఇక సోమవారం ఉదయం కృష్ణంరాజు భౌతిక కాయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు ఆర్కే రోజా, కారుమురి నాగేశ్వర రావు, చెల్లుబోయిన వేణుగోపాల్, పినిపి విశ్వరూప్, చీప్ విప్ ప్రసాద్ రాజు నివాళులు అర్పించారు. అలాగే ఏపీ ప్రభుత్వం తరఫునుంచి వీరూ కృష్ణంరాజు అంత్యక్రియలకు హాజరుకానున్నారు. ముందుగా ఇంటి నుంచి కృష్ణంరాజు అంతిమయాత్ర ప్రారంభం కానుండగా, అనంతరం మొయినాబాద్‌ మండలం కనకమామిడిలోని కృష్ణంరాజు సొంత ఫామ్ హౌస్ లోనే సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తనకు అత్యంత ఆప్త మిత్రుడైన కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ అందుకు అనుగుణంగా ఏర్పాట్లకు ఆదేశాలు ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here