తెలంగాణలో మరో 6 ఆసుపత్రుల్లో కరోనా చికిత్స అనుమతులు రద్దు

Excessive Fees Charged By Private Hospitals, Govt Revoked Permissions of 6 More Hospitals, Govt Revoked Permissions of 6 More Hospitals from Treating, Govt Revoked Permissions of 6 More Hospitals from Treating Covid-19 Patients, Mango News, Nodal Officers To Monitor Private Hospitals COVID-19 Bills, Permission to treat COVID patients revoked, private hospitals do not overcharge, private hospitals extracting extra money, Six hospitals barred from treating COVID-19 patients, telangana, Telangana bars 6 more private hospitals from COVID-19, Telangana bars six more hospitals from Covid services, Telangana Govt Revoked Permissions of 6 More Hospitals, Telangana Govt Revoked Permissions of 6 More Hospitals from Treating Covid-19 Patients

కరోనా చికిత్సకు బాధితుల వద్ద నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం మరియు ప్రోటోకాల్‌ సరిగ్గా పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మే 29 వరకు 10 ఆసుపత్రులపై చర్యలు తీసుకోగా, మే 31, సోమవారం నాడు కూడా మరో 6 ఆసుపత్రుల కరోనా చికిత్స అనుమతులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ రద్దు చేసింది. దీంతో ఇప్పటికి ప్రభుత్వం మొత్తం 16 ఆసుపత్రుల్లో కరోనా చికిత్స అనుమతులను రద్దు చేసినట్లు అయింది. మరోవైపు అధిక ఫీజుల వసూళ్లపై ప్ర‌జ‌ల నుంచి అందిన ఫిర్యాదుల మేర‌కు సోమవరం నాటికి మొత్తం 105 ప్రైవేటు ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీచేసినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య‌శాఖ‌ వెల్లడించింది.

కొత్తగా కరోనా చికిత్స అనుమతులు రద్దు అయిన ఆసుపత్రులివే:

  1. పద్మజ హాస్పిటల్‌,కేపీహెచ్‌బీ కాలనీ, మేడ్చల్‌.
  2. లైఫ్‌లైన్‌ మెడిక్యూర్ హాస్పిటల్‌, అల్వాల్‌, మేడ్చల్‌.
  3. మాక్స్‌ కేర్‌ హాస్పిటల్‌, హనుమకొండ, వరంగల్‌ అర్బన్‌.
  4. టీఎక్స్‌ హాస్పిటల్‌, ఉప్పల్‌, మేడ్చల్‌.
  5. లలిత హాస్పిటల్‌, వరంగల్‌ అర్బన్‌.
  6. శ్రీసాయి రామ్‌ హాస్పిటల్‌, సంగారెడ్డి.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 1 =