కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం

Coronavirus, Covid Beds in Govt Hospitals, COVID-19, Covid-19 Updates in Telangana, Increase up to 25 Percent Covid Beds in Govt Hospitals, Mango News, PIB Headquarters PIB’S BULLETIN ON COVID-19, telangana coronavirus district wise, Telangana Coronavirus News, telangana covid cases today bulletin, telangana covid cases today list, Telangana Health Department, Telangana Health Dept Orders to Increase up to 25 Percent, Telangana Health Dept Orders to Increase up to 25 Percent Covid Beds in Govt Hospitals

తెలంగాణ రాష్ట్రంలో కరోనా రెండో వేవ్ ప్రభావం రోజురోజుకి పెరిగిపోతుంది. రాష్ట్రంలో కొత్తగా 3307 కేసులు నమోదవడంతో ఏప్రిల్ 14, బుధవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,38,045 చేరింది. ప్రస్తుత కరోనా పరిస్థితి దృష్ట్యా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పుడున్న కరోనా బెడ్స్ కు అదనంగా మరో 25 శాతం బెడ్స్ పెంచాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎలెక్టివ్‌ ఆపరేషన్లను వాయిదా వేసుకోవాలని సూచించారు. అలాగే ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా మరిన్ని బెడ్స్ ను కరోనా బాధితులకు కేటాయించాలని ఆదేశాలు ఇచ్చారు.

ఇక కరోనా బాధితులను ఆసుపత్రుల్లో చేర్చేందుకు ప్రత్యేక ప్రోటోకాల్‌ రూపొందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు గురువారం ఉదయం విడుదల చేసిన కరోనా కేసుల బులెటిన్ లో అందుబాటులో ఉన్న బెడ్ల వివరాలను వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో 6,654 బెడ్స్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 6,745 బెడ్స్ ఖాళీగా ఉన్నట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − five =