జాతీయ ప్రిజన్ డ్యూటీ మీట్ లో తెలంగాణకు అగ్రస్థానం, విజేతలను అభినందించిన హోంమంత్రి

Telangana Home Minister Mahmood Ali Felicitated National Prisons Duty Meet Winners, Telangana Tops In Prison Duty Meet, All India Prison Duty Meet , Telangana Home Minister Mahmood Ali, Ministry Of Home Affairs, 6Th All India Prison Duty Meet, Hyderabad Liberation Day, Mango News, Mango News Telugu, Union Home And Cooperation Minister Shri Amit Shah, Union Minister Amit Shah, Union Minister Amit Shah Prison Duty Meet, Prison Duty Meet, Amit Shah Inaugurated Prison Duty Meet, Telangana Prison Duty Meet, Home Minister Congratulated Telangana Prison Duty Meet, Telangna Prisions

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో ఇటీవల జరిగిన 6వ జాతీయ ప్రిజన్ డ్యూటి మీట్ లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. ఈ నేపథ్యంలో విజేతలను హోం మంత్రి తన కార్యాలయంలో బుధవారం నాడు జరిగిన సమావేశంలో అభినందించారు. జైళ్ళ శాఖ డీజీ జితేందర్, ఐజీ రాజేష్ తదితర జైలు అధికారులు పాల్గొన్న సమావేశంలో అధికారులు జాతీయ డ్యూటీ మీట్ లో తెలంగాణ అగ్రస్థానం సాధించిన వివరాలను వెల్లడించారు. ఈ డ్యూటి మీట్ లో మొత్తం 19 రాష్ట్రాలు , 960 మంది క్రీడాకారులు పాల్గొన్నారనీ, మొత్తం మూడు రోజుల పాటు జరిగిన ఈ డ్యూటి మీట్ లో 68 మంది తెలంగాణ జైళ్ల శాఖ ఉద్యోగులు వివిధ క్రీడాంశాలల్లో పాల్గొని అద్భుతమైన ప్రతిభను కనబరచారని కొనియాడారు.

ఆరు బంగారు, ఒక వెండి, రెండు రజత పతకాలతో పాటు నాలుగు ట్రోపీలు సాధించడమే కాక, అత్యధిక పతకాలు సాధించి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన నిలిచిందన్నారు. డ్యూటి మీట్ లో బృందానికి వరంగల్ కేంద్రకారాగార పర్యవేక్షాణాధికారి సంపత్ సారథ్యం వహించారు. అభినందన కార్యక్రమంలో దేశంలో మొదటి స్దానం సాధించినందుకు కృషి చేసిన జైళ్ల శాఖ డీజీ జితేందర్, ఐజీ రాజేష్ లను హోం మంత్రి మహమూద్ అలీ ప్రత్యేకంగా ప్రశంసించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here