ప్రగతి భవన్ కు చేరుకున్న 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన రైతు సదస్సు

CM KCR to Chair Farmer Conference with Leaders of Farmers Associations of 26 States at Pragati Bhavan, CM KCR To Conduct Conference With Farmer Association Leaders, CM KCR To Conduct Farmers Conference, Mango News, Mango News Telugu, CM KCR To Address Farmers In Conference, Telangana Farmers Conference Latest News And Updates, Telangana CM KCR Farmers Conference, CM KCR News And Live Updates, CM KCR To Held Farmer Conference At Pragathi Bhavan, Telangana CM KCR, TRS Party, Farmers Conference,Pragathi Bhavan,

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవసాయాభివృద్ధి, సాగునీటిరంగ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల నుంచి బయలుదేరిన రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు శుక్రవారం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలు ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉదయం అల్పాహార కార్యక్రమం తర్వాత, వ్యవసాయం, సాగునీటి రంగం తదితర తెలంగాణ ప్రగతిపై రూపొందించిన డాక్యుమెంటరీని జాతీయ రైతు సంఘాల నేతలు తిలకించనున్నట్టు తెలిపారు. అనంతరం రైతు సంఘాల నేతలతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రైతు సదస్సు జరగనుందని పేర్కొన్నారు.

ఈ సదస్సు సందర్భంగా దేశంలో నెలకొన్న వ్యవసాయరంగ పరిస్థితులతో పాటు తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర వ్యవసాయ అనుబంధ రంగాల పురోగతిపై చర్చించనున్నట్టు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం జాతీయ రైతు సంఘాల నేతలతో కలిసి భోజన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని చెప్పారు. ఇక లంచ్ అనంతరం కూడా రైతు సదస్సు తిరిగి కొనసాగనుందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + sixteen =