తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా .. నేడు అమెరికా పర్యటనకు మంత్రి కేటీఆర్‌

Telangana IT Minister KTR To Go For Two-Week Tour of US From Today Aimed at Investments For The State,IT Minister KTR To Go For Two-Week Tour of US,Telangana IT Minister KTR To Go For Two-Week Tour,KTR To Go For Two-Week Tour of US From Today,Mango News,Mango News Telugu,Aimed At Investments For The State,Telangana IT Minister KTR,Telangana IT Minister KTR Latest News And Updates,IT Minister KTR US Tour,KTR US Tour

తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం యునైటెడ్ స్టేట్స్ (అమెరికా) పర్యటనకు వెళ్తున్నారు. నేటినుంచి రెండు వారాల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్‌ అమెరికాకు చెందిన పలు ప్రముఖ కంపెనీల చైర్మన్లు, సీఈవోలు మరియు ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పరిశ్రమల స్థాపనకు అమలు చేస్తున్న విధానాలను ఆయన వారికి వివరించనున్నారు. కాగా మంత్రి కేటీఆర్‌తో పాటు తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఇంకా పలువురు అధికారులు కూడా అమెరికా వెళ్తున్నారు.

కాగా, ఇటీవలే లండన్ టూర్‌కు వెళ్లిన మంత్రి కేటీఆర్ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించిన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమింగ్ దిగ్గజం డాన్జ్ హైదరాబాద్‌లో ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వీటితో పాటు తెలంగాణలో రూ.200 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు బ్రిటన్‌కు చెందిన ఇన్ క్రెడిబుల్ హస్క్ ఇంటర్నేషనల్ గ్రూప్ ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ తాజా అమెరికా పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలను అమెరికా పెట్టుబడిదారులకు వివరించనున్నారు. ఇక ఈ పర్యటనలో తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి కొన్ని కీలక ఒప్పందాలను మంత్రి కేటీఆర్ బృందం కుదుర్చుకోనుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 1 =