యూపీఎస్‌సీ ఛైర్మన్‌గా నేడు ప్రమాణ స్వీకారం చేసిన మ‌నోజ్ సోనీ

Eminent Educationist Manoj Soni Takes Oath as UPSC New Chairman Today,Eminent Educationist Manoj Soni,Manoj Soni Takes Oath as UPSC,Manoj Soni Takes Oath as UPSC New Chairman Today,Mango News,Mango News Telugu,Manoj Soni takes oath as UPSC chairman,Dr Manoj Soni is the new Chairman of Union Public Service Commission,Manoj Soni,Manoj Soni Latest News And Updates,UPSC New Chairman,UPSC New Chairman Today,UPSC New Chairman Latest News And Updates

ప్రముఖ విద్యావేత్త డాక్టర్ మనోజ్ సోనీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) ఛైర్మన్‌గా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. కమిషన్‌లోని సీనియర్ మోస్ట్ సభ్యురాలు శ్రీమతి స్మితా నాగరాజ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ మేరకు స్మితా నాగ‌రాజ్ ఇవాళ మ‌నోజ్ సోనీ చేత ప్ర‌మాణ స్వీకారం చేయించిన‌ట్లు కేంద్ర మంత్రిత్వ‌శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక మ‌నోజ్ సోనీ 2017, జూన్ 28వ తేదీన క‌మిష‌న్‌లో స‌భ్యుడిగా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఆయ‌న 2022, ఏప్రిల్ 5వ తేదీన భారత రాజ్యాంగం ఆర్టికల్ 316 (ఎ) ప్రకారం యూపీఎస్‌సీ ఛైర్మన్‌ పదవి యొక్క విధులను నిర్వర్తించడానికి నియమించబడ్డారు. అయితే ప్ర‌స్తుతం యూపీఎస్సీ బోర్డులో అయిదుగురు స‌భ్యుల వేక‌న్సీ ఉంది. యూపీఎస్సీకి అపాయింట్ కావ‌డానికి ముందు ఆయ‌న మూడు సార్లు వైస్ ఛాన్స‌ల‌ర్‌గా చేశారు. ఈ క్రమంలో గుజ‌రాత్‌లోని అంబేద్క‌ర్ వ‌ర్సిటీ, బ‌రోడాలోని స‌య్యాజిరావు వ‌ర్సిటీల‌కు వీసీగా చేశారు. కాగా దేశవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్‌, ఐఎఫ్ఎస్ ఆఫీస‌ర్ల ఎంపిక‌ యూపీఎస్సీ ద్వారానే జ‌రుగుతుందన్న విష‌యం తెలిసిందే. యూపీఎస్సీ క‌మిష‌న్‌లో ఒక ఛైర్మన్‌, ప‌ది మంది స‌భ్యులు ఉంటారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − one =