కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం ఏదైనా.. వెన్నుపోటు పొడవ‌ను, బ్లాక్‌మెయిల్ చేయ‌ను – కేపీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్‌

Karnataka Congress Chief DK Shivakumar Says Whatever The Decision on CM Post I Wont Backstab or Blackmail To Party,Karnataka Congress Chief DK Shivakumar,CM Post I wont backstab or blackmail,Shivakumar says will not backstab,Mango News,Mango News Telugu,Karnataka Government Formation Tussle,Congress Chief DK Shivakumar,Congress Chief DK Shivakumar Latest News,Congress Chief DK Shivakumar Latest Updates,DK Shivakumar Says Whatever The Decision on CM Post I Wont Backstab,DK Shivakumar Says Whatever The Decision on CM Post I Wont Blackmail

కర్ణాటక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆనందంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి ఎదురైంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని నియమించాలనే దానిపై ఆ పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతుంది. పార్టీ విజయానికి కృషి చేసిన కీలక నేతలు.. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఒకవైపు, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివ‌కుమార్‌ మరోవైపు ఇరువురూ సీఎం పదవిని ఆశిస్తున్నారు. దీంతో సీఎం అభ్య‌ర్థిని తేల్చేందుకు ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్ద‌లు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నారు. దీనిపై ఒక నిర్ణయానికి రావడానికి ఇప్పటికే బెంగళూరులో సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి గెలిచిన 135 మంది ఎమ్మెల్యేల మద్దతు ఎవరికీ ఉందో అంచనా వేసింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలోని ముగ్గురు పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తీసుకుని హై కమాండ్ కు అందజేశారు. ఈ క్రమంలో ఇద్దరు నేతలను ఢిల్లీకి రమ్మని సూచించింది. హై కమాండ్ ఆదేశాల మేరకు సిద్దరామయ్య సోమవారమే ఢిల్లీ చేరుకోగా.. శివకుమార్ నిన్న తన జన్మదినం కారణంగా వెళ్ళలేదు.

ఈ నేపథ్యంలో డీకే శివ‌కుమార్‌ నేడు ఢిల్లీకి పయనమయ్యారు. విమానాశ్రయానికి బయలుదేరేముందు తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. తాను బాధ్య‌త క‌లిగిన వ్య‌క్తినని, త‌న‌ను ఆద‌రించినా, ఆద‌రించ‌క‌పోయినా.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ఒక కార్యకర్తగా పాటిస్తానని పేర్కొన్నారు. త‌మ‌ది ఐక్య కూట‌మి అని, ప్రజల ఆదరణతో 135 స్థానాలు గెలుపొందామని గుర్తు చేశారు. తామందరం కలిసి పనిచేసి రాష్ట్రంలో పార్టీని గెలిపించుకున్నామని, అందుకే కూట‌మిని విభ‌జించాల‌న్న కూడా ఆలోచ‌న త‌న‌కు లేద‌ని తేల్చి చెప్పారు. తనకు సీఎం పదవి ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. ఎవ‌రినీ వెన్నుపోటు పొడ‌వ‌డ‌ను అని, ఎవ‌ర్నీ బ్లాక్‌మెయిల్ చేయ‌నని స్పష్టం చేశారు. తనపై నమ్మకముంచి సోనియా గాంధీ పార్టీ రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు అప్పగించారని, తాను కూడా కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలోకి తేవడానికి కృషి చేశానని తెలిపారు. తనతో పాటు అందరికీ న్యాయం చేయాలనే పార్టీ అధిష్టానం చూస్తుందని, సీఎం అభ్యర్థి ఎవరనే విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని శివకుమార్ చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 2 =