ఇండోనేషియాలో భూకంపంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగడం బాధాకరం, భారత్ అండగా ఉంటుంది: ప్రధాని మోదీ

Pm Modi Expressed Deep Grief Over The Loss Of Lives Due To An Earthquake In Indonesia,Earthquake In Indonesia,Indonesia Earthquake,Pm Modi Expressed Grief,Mango News,Mango News Telugu,Loss Of Life In Indonesia, Property Loss In Indonesia,Earthquake In Indonesia Is Sad, India Stands By Pm Modi,Pm Moodi Latest News And Updates,Prime Minister Modi,Indian Prime Minister Modi,Indian Pm Modi,Indian Prime Minister,Indonesia Latest News And Updates

ఇండోనేషియాలో సోమవారం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. పశ్చిమ జావాలోని సియాంజూర్ పట్టణంలో రెక్టర్ స్కేల్ పై 5.6 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 252కి పెరిగింది. అలాగే మరో 31 మంది గల్లంతవగా, 377 మంది గాయపడినట్టు అక్కడి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సియాంజూర్ లో కొండచరియలు విరిగిపడటం మూలాన ప్రమాద తీవ్రత అధికంగా ఉంది. మృతుల్లో ఎక్కువుగా చిన్న పిల్లలే ఉండగా, ఈ భూకంపం వలన 7,060 మంది నిరాశ్రయులు అయినట్టు తెలిపారు. కూలిపోయిన భవనాల శిథిలాల కింద ఉండిపోయిన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతుండగా, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో ఇండోనేషియాలో సంభవించిన విపత్తుపై ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇండోనేషియాలో భూకంపం వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన విష‌యంపై ప్రధాని మోదీ తన ప్రగాఢ సంతాపాన్ని, వేదనను వ్య‌క్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఈ దుఃఖ సమయంలో భారత్‌ ఇండోనేషియాకు అండగా నిలుస్తుందన్నారు.

ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “ఇండోనేషియాలో భూకంపం వల్ల ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరగడం బాధాకరం. బాధితులకు మరియు వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ దుఃఖ సమయంలో భారత్ ఇండోనేషియాకు అండగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − twelve =