కరోనా సమయంలో స్వచ్ఛత చాలా అవసరం : మంత్రి కేటీఆర్

325 Swachh Auto Tipper Vehicles, GHMC, GHMC Swachh Auto Tipper Vehicles, GHMC Swachh autos, GHMC to add 650 more Swachh autos, KTR, KTR Flagged off 325 Swachh Auto Tipper Vehicles, Mango News, Minister KTR Flagged off 325 Swachh Auto Tipper Vehicles, Swachh Auto Tipper Vehicles, Telangana Municipal Minister, Telangana Municipal Minister KTR, Telangana Municipal Minister KTR Flagged off 325 Swachh Auto Tipper Vehicles

స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యంగా ఇంటింటి చెత్త సేకరణ కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) 650 స్వచ్ఛ ఆటోలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ వద్ద గురువారం ఉదయం 325 స్వచ్ఛ ఆటోలను తెలంగాణ రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కరోనా సమయంలో స్వచ్ఛత చాలా అవసరం : మంత్రి కేటీఆర్

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ప్రస్తుత కరోనా సమయంలో స్వచ్ఛత చాలా అవసరమని చెప్పారు. స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వంతోనే, జీహెచ్‌ఎంసీతోనే కాదని ప్రజలు కూడా బాధ్యతతో భాగస్వాములు కావాలని‌ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు స్వచ్ఛత, పారిశుధ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ద పెట్టి 2015లోనే స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. ఇప్పటికే 2,500 స్వచ్ఛ వాహనాలను ద్వారా నగరంలో చెత్తసేకరణ జరుగుతుందని అన్నారు. కొత్తగా మరో 650 స్వచ్ఛ ఆటోలను అందుబాటులోకి తెచ్చామని, వాటిల్లో ఈ రోజు 325 స్వచ్ఛ ఆటోలను ప్రారంభించినట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 3 =