తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు: పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయజెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

Telangana National Integration Day CM KCR Hoists National Flag at Public Gardens in Hyderabad, CM KCR Hoists National Flag at Public Gardens, Telangana National Integration Day CM KCR, Telangana Govt Announces Holiday, Telangana National Integration Day, Holiday on Telangana Day, Telangana Jathiya Samaikyatha Vajrotsavalu, Jathiya Samaikyatha Vajrotsavalu, Mango News, Mango News Telugu, CS And DGP Reviews Telangana Day Arrangements, Telangana Day, Telangana Day 2022, Telangana Jathiya Samaikyatha Vajrotsavalu 2022, Telangna CM KCR, Telangna Day Latest News And Live Updates, Telangana

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా దినోత్స‌వంగా పాటించాలని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణయించడంతో పాటుగా 2022 సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా దినోత్స‌వం సందర్భంగా నాంపల్లిలోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పాల్గొని జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పౌలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అలాగే ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం చేశారు. యావత్ తెలంగాణ ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు సీఎం కేసీఆర్ ముందుగా గన్‌పార్క్‌ వద్దకు చేరుకొని, అమరవీరుల స్మారకం వద్ద నివాళి అర్పించారు.

ఇక అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. మెదక్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో మంత్రి కేటీఆర్, సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో మంత్రి హరీశ్‌ రావు, మహబూబ్ నగర్ పరేడ్ గ్రౌండ్స్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో మంత్రి పువ్వాడ అజయ్, నిర్మల్‌ కలెక్టరేట్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జగిత్యాల కలెక్టరేట్‌లో మంత్రి కొప్పుల ఈశ్వర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =