సర్ధార్ వల్లభాయ్ పటేల్ చర్య వల్లే నాడు తెలంగాణకు స్వాతంత్య్రం లభించింది – విమోచన దినోత్సవ వేడుకల్లో అమిత్ షా

Union Minister Amit Shah Participates Hyderabad Liberation Day Celebrations at Secunderabad Parade Grounds,Mango News,Mango News Telugu,Union Minister Amit Shah,Amit Shah Participates Hyderabad Liberation Day Celebrations,Hyderabad Liberation Day Celebrations at Secunderabad Parade Grounds,Hyderabad Liberation Day Celebrations,Union Minister Amit Shah Participates Hyderabad Liberation Day Celebrations,Amit Shah Participates Hyderabad Liberation Day Celebrations,Latest Telugu Breaking News,Political News Updates,Latest Political News

సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు పేరుతొ నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఆయన అమరవీరులకు నివాళులు అర్పించి, సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించిన అమిత్ షా, సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అయితే భారతదేశం మొత్తానికి స్వాతంత్య్రం సిద్దించిన 13 నెలల తర్వాత హైదరాబాద్‌ ప్రజలకు స్వాతంత్య్రం వచ్చిందని, హైదరాబాద్‌ సహా కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్‌ 17న స్వాతంత్య్రం లభిందని గుర్తుచేశారు. అప్పటి హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ కృషి లేకపోతే నిజాం నుంచి విముక్తి లభించేందుకు తెలంగాణకు ఇంకా సమయం పట్టేదని, నిజాం, రజాకార్ల నియంతృత్వ పాలనకు ఆయన ‘ఆపరేషన్‌ పోలో’ ద్వారా ముగింపు పలికారని చెప్పారు. కానీ నేడు విమోచన దినోత్సవం జరిపేందుకు అన్ని పార్టీలు భయపడుతున్నాయని, అందుకే ఈ సంవత్సరం నుంచి హైదరాబాద్‌ విమోచన దినోత్సవం నిర్వహించాలని ప్రధాని మోదీ ఆదేశించారని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ మార్గదర్శనంలో దేశంలోని అనేక రాష్ట్రాలు తమ ఔన్నత్యాన్ని చాటుకుంటున్నాయని, ఈ క్రమంలో తెలంగాణ నేడు తన ఘనమైన చరిత్రను భావి తరాలకు అందించడానికి సిద్దమైనదని, దీనిని బీజేపీ కొనసాగిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. చరిత్రను వక్రీకరించి కొందరు వివిధ పేర్లతో విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని, కానీ నాటి పోరాటంలో పాల్గొన్న వారందరినీ మనం గౌరవించాలంటే తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతోనే దీనిని నిర్వహించాలని అమిత్ షా స్పష్టం చేశారు. ఇక ఈ కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్ణాటక రవాణాశాఖ మంత్రి శ్రీరాములు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here