14 పోస్టాపీసు పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో సేవలు పునఃప్రారంభం

Hyderabad Passport services, Hyderabad Passport services resume, Hyderabad Passport services resume today, Hyderabad Regional Passport Office to resume, Mango News, Passport Services, Passport Services Resumed, Passport Services Resumed In Telangana, post office passport seva kendras, Services Resumed in 14 Post Office Passport Seva Kendras, telangana, Telangana Passport application services, Telangana Passport application services to restart, Telangana Services Resumed in 14 Post Office Passport Seva Kendras

రాష్ట్రంలో అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ ను జూన్ 19 వరకు కొనసాగిస్తామని, అలాగే ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంట వరకు సడలింపు ఇస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. పగటిపూట పూర్తిగా సడలింపు ఉండడంతో రాష్ట్రంలో అనేక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 14 తపాలా కార్యాలయాల్లో పాస్‌పోర్టు సేవలు కూడా నేటి నుంచి(జూన్ 10, గురువారం) పునఃప్రారంభం అయ్యాయి.

ముందుగా కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రంలోని 5 కీలక పాస్‌పోర్టు సేవా కేంద్రాలైన బేగంపేట్‌, అమీర్‌పేట్‌, టోలీచౌకీ, నిజామాబాద్‌, కరీంనగర్‌ లలో, మరియు 14 తపాలా కార్యాలయాల్లో పాస్‌పోర్టు సేవలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా 5 ప్రధాన పాస్‌పోర్టు సేవ కేంద్రాల్లో జూన్ 1 నుంచే కార్యకలాపాలు ప్రారంభమవగా, మేడ్చల్‌, వరంగల్‌, ఖమ్మం, మెదక్‌, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌, కామారెడ్డి, వికారాబాద్‌, వనపర్తి వంటి 14 తపాలా కార్యాలయాల్లో పాస్ పోర్టు సేవలను నేటి నుంచి పునః ప్రారంభించారు. ఇకపై రాష్ట్రంలో అన్ని పాస్‌పోర్టు సేవా కేంద్రాలు సాధారణ సమయాల్లో పని చేస్తాయని సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి బాలయ్య తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here