తెలంగాణలో 50 లక్షలు దాటిన డయాలసిస్‌ సెషన్లు – వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు

Telangana State Completes 50 Lakh Free Dialysis Sessions Health Minister Harish Rao,Dialysis Sessions Crossed 50 lakhs,Dialysis Sessions in Telangana,Health Minister Harish Rao,Mango News,Mango News Telugu,Dialysis Sessions Telangana,Telangana Health Department,Telangana Health Bulletin,Telangana Health Department Website,Telangana Health Minister,Telangana Health Bulletin Latest News And Updates,Telangana Health Minister 2022,Telangana Health Department 2022,Chief Advisor Of Telangana,Somesh Kumar Ias,Telangana Health Secretary,Telangana Health News and Live Updates

తెలంగాణ రాష్ట్రంలో కిడ్నీ రోగులకు డయాలసిస్‌ సేవలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో డయాలసిస్‌ సెషన్లు కొత్త మైలురాయిని అధిగమించాయి. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కిడ్నీ రోగులకు అందించిన డయాలసిస్‌ సెషన్ల సంఖ్య 50 లక్షలు దాటాయి. ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తెలంగాణ రావడం వల్ల, కేసీఆర్ సీఎం కావడం వల్లనే ఇది సాధ్యం అయ్యిందని పేర్కొన్నారు.

“కిడ్నీ రోగుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఉచితంగా అందిస్తున్న డ‌యాల‌సిస్ సెష‌న్లు 50 ల‌క్ష‌లు దాటాయి. సీఎం కేసీఆర్ కిడ్నీ బాధితుల వేద‌న‌ను చూసి మాన‌వ‌తా దృక్ప‌థంతో తీసుకున్న నిర్ణ‌యం ఫ‌లితంగా దాదాపు రూ.700 కోట్ల ఖర్చుతో కూడిన సేవ‌ల‌ను వారు ఉచితంగా పొంద‌గ‌లిగారు. తెలంగాణ రాకముందు డయాలసిస్ సేవలు అందుబాటులో లేక బాధితులు ఇబ్బంది పడేవారు. కళ్ళనిండా ఆ పరిస్థితులు చూసిన సీఎం కేసీఆర్, వారి కష్టాలు తీర్చాలని 3 నుండి 82 కు డయాలసిస్ కేంద్రాలు పెంచారు. నియోజకవర్గానికి ఒకటి ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. మారుమూల ప్రాంతంలో ఉండి సైతం డయాలసిస్ సేవలు పొందేలా సదుపాయం కల్పిస్తున్నారు. తెలంగాణ రావడం వల్ల, కేసీఆర్ సీఎం కావడం వల్లనే ఇది సాధ్యం అయ్యింది” అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − one =