గాంధీభవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి.. ‘వార్ రూం’పై పోలీసుల దాడికి నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు ధర్నా

T-Congress Held Agitation at Gandhi Bhavan Over Police Raids on Strategy Team Head Office,T-Congress Agitation,T-Congress Agitation at Gandhi Bhavan,T-Congress Gandhi Bhavan,Mango News,Mango News Telugu,Police Raids on Strategy Team,Police Raids on Head Office,T-Congress Police Raids,YSR Telangana Party,YSRTP President YS Sharmila,Sharmila To Meet Telangana DGP,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,YSRTP Chief YS Sharmila

హైదరాబాద్ లోని గాంధీభవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ‘వార్ రూం’, కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసుల దాడులు చేయడంపై ఆ పార్టీ శ్రేణులు నిరసన తెలిపాయి. సీఎం కేసీఆర్ కనుసన్నల్లో పనిచేస్తున్న పోలీసులు ప్రతిపక్షాలను వేధిస్తున్నాయని పేర్కొంటూ టీ-కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ వద్ద ధర్నా చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. అలాగే సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మ‌ను దహనం చేశారు. అనంతరం గాంధీ భవన్ నుంచి ప్రగతి భవన్ వరకు బయలు దేరిన కాంగ్రెస్ నేతలను గేటు వద్ద బారికేడ్లను పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

కాగా మంగళవారం రాత్రి మాదాపూర్‌లోని రాష్ట్ర కాంగ్రెస్‌ రాజకీయ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు కార్యాలయంలో సైబరాబాద్‌ పోలీసులు సోదాలు నిర్వహించారు. సునీల్‌ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో పలు పోస్టులు పెడుతున్నట్లు గుర్తించిన నేపథ్యంలో పోలీసులు దాడి చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా అక్కడి కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బందికి చెందిన సెల్‌ఫోన్లతో పాటు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను అధికారులు సీజ్‌ చేశారు. అయితే పోలీసుల దాడిని ఖండించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని పోలీస్‌ కమిషనరేట్‌ వద్ద నిరసనతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో భారీగా గుమికూడిన కాంగ్రెస్ శ్రేణులు బుధవారం ధర్నాకు దిగాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + nine =