భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పర్యటన, వరద ముంపు బాధితుల పరామర్శ

Telangana YSRTP Chief YS Sharmila Visits The Flood Affected Areas in Bhadradri Kothagudem District, YSRTP Chief YS Sharmila Visits The Flood Affected Areas in Bhadradri Kothagudem District, YS Sharmila Visits The Flood Affected Areas in Bhadradri Kothagudem District, Telangana YSRTP Chief Visits The Flood Affected Areas in Bhadradri Kothagudem District, Bhadradri Kothagudem District Flood Affected Areas, Flood Affected Areas in Bhadradri Kothagudem District, Bhadradri Kothagudem District, Flood Affected Areas, YSR Telangana Party Founder-President YS Sharmila, Telangana YSRTP Chief YS Sharmila, YSRTP Chief YS Sharmila, Telangana YSRTP Chief, YS Sharmila, Bhadradri Kothagudem District Flood Affected Areas News, Bhadradri Kothagudem District Flood Affected Areas Latest News, Bhadradri Kothagudem District Flood Affected Areas Latest Updates, Bhadradri Kothagudem District Flood Affected Areas Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జలమయమైన సంగతి తెలిసిందే. కనీవినీ ఎరుగని రీతిలో వచ్చిన భారీ వరదలకు భద్రాచలం నీట మునిగింది. దీంతో పంట నష్టంతో పాటు, తీవ్ర ఆస్థి నష్టం కూడా సంభవించింది. ఈ నేపథ్యంలో.. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. పినపాక నియోజక వర్గం రావి గూడెం గ్రామంలో పర్యటించిన షర్మిల గోదావరి వరదలతో మునిగిపోయిన ఇళ్లను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి ప్రభుత్వం నుంచి సాయం ఏమైనా అందిందా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు షర్మిలను కలిసి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆమె దృష్టికి తెచ్చారు.

అనంతరం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. వరదల వలన లక్షల మంది జీవితాలు ఆగం అయ్యాయని, పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరదలతో ప్రజలు సర్వం కోల్పోయారని, తక్షణమే వారిని ఆదుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి వరద బాధితులకి రూ. 10 వేల సాయం అందిస్తామని ప్రకటించారని, కానీ అది ఇంకా బాధితులకు అందలేదని షర్మిల వెల్లడించారు. వరదల వలన లక్షల మంది జీవితాలు ఆగం అయ్యాయని, ఈ సమయంలో కూడా ఇచ్చిన హామీ నిలబెట్టుకోక పోతే ఎలా ముఖ్యమంత్రి గారు? అని ప్రశ్నించారు. అలాగే చాలామంది ఇళ్లు కోల్పోయారని, ప్రభుత్వం ఇచ్చే రూ. 10 వేలు సరిపోవని, రూ. 25 వేలు ఇవ్వాలని షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 20 =