తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 13 మండ‌లాలు ఏర్పాటు

Telangana Government Issued Orders over Formation of 13 New Mandals, TS Government Issued Orders over Formation of 13 New Mandals, Government Issued Orders over Formation of 13 New Mandals, Formation of 13 New Mandals, 13 New Mandals Formation, 13 New Mandals In Telangana, 13 New Mandals, Telangana Government Established 13 New Mandals, Telangana Government Announced 13 New Mandals Formation, Telangana New Mandals, TS New Mandals, Telangana New Mandals names, Telangana 13 New Mandals list, Telangana New Mandals News, Telangana New Mandals Latest News, Telangana New Mandals Latest Updates, Telangana New Mandals Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 13 మండ‌లాలు ఏర్పాటు అయ్యాయి. పాలనా సంస్కరణల్లో భాగంగా ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దార్శనికతతో ఇప్పటికే నూతన జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా ప్రజా ఆకాంక్షలను, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల్లో కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. కొత్త మండలాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శనివారం సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు

తెలంగాణలో 13 కొత్త మండలాల వివరాలు ఇవే:

  1. నారాయణ పేట జిల్లా/రెవిన్యూ డివిజన్ పరిధిలో గుండుమల్ మండలం
  2. నారాయణ పేట జిల్లా/రెవిన్యూ డివిజన్ పరిధిలో కొత్తపల్లె మండలం
  3. వికారాబాద్ జిల్లాలోని తాండూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో దుడ్యాల్ మండలం
  4. మహబూబ్ నగర్ జిల్లా/రెవిన్యూ డివిజన్ పరిధిలో కౌకుంట్ల మండలం
  5. నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో ఆలూర్ మండలం
  6. నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో డొంకేశ్వర్ మండలం
  7. నిజామాబాద్ జిల్లా, బోధన్ రెవిన్యూ డివిజన్ పరిధిలో సాలూర మండలం
  8. మహబూబాబాద్ జిల్లా/రెవిన్యూ డివిజన్ పరిధిలో సీరోల్ మండలం
  9. నల్లగొండ జిల్లా/రెవిన్యూ డివిజన్ పరిధిలో గట్టుప్పల్ మండలం
  10. సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ రెవిన్యూ డివిజన్ పరిధిలో నిజాంపేట్ మండలం
  11. కామారెడ్డి జిల్లాలోని, బాన్స్ వాడ రెవిన్యూ డివిజన్ పరిధిలో డోంగ్లి మండలం
  12. జగిత్యాల జిల్లా/జగిత్యాల రెవిన్యూ డివిజన్ పరిలో ఎండపల్లి మండలం
  13. జగిత్యాల జిల్లా, కోరుట్ల డివిజన్ పరిధిలో భీమారం మండలం

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =