ఎట్టిపరిస్థితిల్లోనూ ప్రాణనష్టం జరగకూడదు, భారీ వర్షాలపై జిల్లాకలెక్టర్లతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్

Telangana CS Somesh Kumar held Teleconference with District Collectors over Heavy Rains Across the State, CS Somesh Kumar held Teleconference with District Collectors over Heavy Rains Across the State, Somesh Kumar held Teleconference with District Collectors over Heavy Rains Across the State, Teleconference with District Collectors over Heavy Rains Across the State, Teleconference with District Collectors, Heavy Rains Across the State, Telangana CS Somesh Kumar, District Collectors, Heavy Rains In Telangana, Telangana Chief Secretary Somesh Kumar, Chief Secretary Somesh Kumar, Telangana Chief Secretary, Somesh Kumar, Heavy Rains In Telangana News, Heavy Rains In Telangana Latest News, Heavy Rains In Telangana Latest Updates, Heavy Rains In Telangana Live Updates, Mango News, Mango News Telugu,

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్లతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీకాన్ఫరెన్స్ లో విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కూడా పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలపై నిర్వహించిన ఈ టెలీ కాన్ఫరెన్స్ లో సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రానున్న రెండు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినందున జిల్లా కలెక్టర్లు మరింత అప్రమత్తతతో ఉండాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం ఏర్పడకుండా జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు.

వరుసగా రెండు రోజులు సెలవు రోజులు వస్తున్నందున, జిల్లాల్లోని అధికారులు సెలవులను ఉపయోగించకుండా సహాయ, పునరావాస కార్యక్రమాలలో పాల్గొనేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. పొరుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నందున వరదలు అధికంగా వచ్చే అవకాశం ఉందని, ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని రిజర్వాయర్లు, చెరువులు పూర్తిగా నిండినందున చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఎక్కడైతే రహదారులు, బ్రిడ్జిలు తెగాయో ఆమార్గాల్లో ప్రమాదాలు జరగకుండా వాహనాలను, ప్రయాణకులను నిలిపి వేయాలని, ఈ విషయంలో పోలీసులతో సమన్వయము చేసుకోవాలని పేర్కొన్నారు. పోలీసు, నీటి పారుదల, రోడ్లు భవనాలు, విధ్యుత్, రెవిన్యూ తదితర శాఖల లన్నీ మరింత సమన్వయంతో సీఎస్ సోమేశ్ కుమార్ పనిచేయాలని తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 4 =