తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కొత్త అధ్యక్షుడిగా కేఎల్ దామోదర్ ప్రసాద్

Telugu Film Producers Council Elections: Producer KL Damodar Prasad Elected as New President,Telugu Film Producers Council Elections,Telugu Film Producers Council,Telugu Film Producers,Producer KL Damodar Prasad,Producer KL Damodar Prasad Latest News,Producer KL Damodar Prasad Latest Updates,Producer KL Damodar Prasad News,Telugu Film Producers Council President Producer KL Damodar Prasad,KL Damodar Prasad,KL Damodar Prasad News,KL Damodar Prasad Latest News,Telugu Film Producers Council New President,Telugu Film Producers Council New President KL Damodar Prasad,Tollywood Producer Kl Damodara Prasad Wins The TFPC Elections,Producer’s Council Elections,Damodar Prasad As The President Of Telugu Producers Council,TFPC Elections,Telugu Film Producers Council Elections News,K L Damodar Prasad Elected As TFPC Elections,Producers Council Elections 2023,Producers Council Elections,Mango News,Mango News Telugu

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి (తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్) ఎన్నికలు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగిన విషయం తెలిసిందే. అనంతరం ఫలితాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్రొడ్యూసర్స్ ప్యానల్/గిల్డ్ అభ్యర్థి కేఎల్ దామోదర్ ప్రసాద్ అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు మద్దతు తెలిపిన దామోదర్ ప్రసాద్ 339 ఓట్లు సాధించగా, తన ప్రత్యర్థి, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్యానెల్ అభ్యర్థి జెమిని కిరణ్ కు 315 ఓట్లు వచ్చాయి. దీంతో 24 ఓట్ల తేడాతో దామోదర ప్రసాద్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. ఇక ఉపాధ్యక్ష పదవికి సుప్రియ, అశోక్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే ట్రెజరర్ గా రామ సత్యన్నారాయణ, సెక్రెటరీలుగా ప్రసన్న కుమార్, వైవీఎస్ చౌదరి, జాయింట్ సెక్రెటరీలుగా భారత్ చౌదరి, నట్టి కుమార్ ఎన్నికయ్యారు. కాగా ఈ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు (470) సాధించిన అభ్యర్థిగా నిర్మాత దిల్ రాజు నిలిచారు.

ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ గా ఎన్నికైంది వీరే:

  1. దిల్ రాజు (470 ఓట్లు)
  2. డీవీవీ దానయ్య (421)
  3. పీవీ రవి కిషోర్ – (419)
  4. రవిశంకర్ యలమంచిలి ( 416)
  5. పద్మిని.ఎన్ – (413)
  6. బెక్కం వేణుగోపాల్ – (406)
  7. సురేందర్ రెడ్డి.వై – (396)
  8. గోపీనాథ్ ఆచంట (353)
  9. మధుసూదన్ రెడ్డి.బి (347)
  10. కేశవరావు పల్లి (323)
  11. శ్రీనివాస్ రావు వజ్జ (306)
  12. అభిషేక్ అగర్వాల్ (297)
  13. కృష్ణ తోట (293)
  14. రామకృష్ణ ప్రతాని గౌడ్ (286)
  15. కిషోర్ పూసల (285).

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − three =