మందమర్రి ఓటర్ల చేతిలోనే గెలుపోటములు

The Victory Is In The Hands Of Mandamarri Voters,Mandamarri Assembly Constituency,Mandamarri Constituency,Mandamarri Mandal Political Map,Mango News,Mango News Telugu,Mandamarri Politics News,Mandamarri Politics News Today,Telangana Assembly Election 2023,Telangana Assembly Election Live Updates,Cm Kcr News And Live Updates, Telangna Congress Party, Telangna Bjp Party, Ysrtp,Trs Party, Brs Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Genaral Assembly Elections

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ సమీపిస్తున్నకొద్దీ.. తమ విజయావకాశాలపై అభ్యర్థులలో గుబులు పెరిగిపోతోంది. నేతల గెలుపోటములపై ప్రజలలో ఆసక్తి పెరుగుతోంది. ఈ సారి ఎన్నికలలో ఎవరు రాష్ట్రాన్ని పాలిస్తారు? ఏ అభ్యర్థి గెలుస్తాడు?  ఏ ఏ నియోజకవర్గాలలో ఏ పార్టీ పాగా వేస్తుందనే చర్చలు  జోరందుకున్నాయి. నియోజకవర్గాల వారీగా ఏ పార్టీకి ఎంత బలముందనే చర్చలు సాగుతున్నాయి. అలా చెన్నూరు నియోజకవర్గంలో ఏ మండలం ఎవరి పక్షాన ఉందోనని లెక్కలు ..ఇప్పుడు పొలిటికల్  సర్కిల్‌లో వినిపిస్తున్నాయి.

చెన్నూర్‌ నియోజకవర్గంలో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల విజయావకాశాలను ఒకసారి పరిశీలిస్తే.. మందమర్రి ఓటర్లు ఏ పార్టీకి అయితే మొగ్గు చూపించారో ఆ పార్టీ అభ్యర్థే చెన్నూరులో విజయకేతనం ఎగురవేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో కార్మిక, కర్షక ఓటర్లు కలిసే ఉంటున్నా కూడా.. అసెంబ్లీ ఎన్నికల్లో మందమర్రిలో ఉంటున్న కార్మిక కుటుంబాల ఓట్లే.. గెలుపోటములను ప్రభావితం చేస్తున్న లెక్కలు ఉన్నాయి.

దీంతో ప్రధాన పార్టీలతో పాటు.. చిన్న పార్టీల అభ్యర్థులు కూడా మందమర్రి పైనే ఆశలు పెట్టుకున్నారు. చెన్నూర్‌ నియోజకవర్గంలో ప్రస్తుతం అన్ని పార్టీలకు చెందిన 14 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీ, బీఎస్పీతో పాటు 10 మంది స్వతంత్రులు కూడా బరిలో ఉన్నారు. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో  అభ్యర్థులంతా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రేయింబవళ్లు జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నారు.

చెన్నూర్‌ నియోజకవర్గంలో మొత్తంగా 1,88,283 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఒక్క మందమర్రి మండలంలోనే 77,205 మంది ఓటర్లున్నారు.ఆ తర్వాత చెన్నూర్‌, కోటపల్లి, భీమారం, జైపూర్‌ మండలాలు అన్నీ కలిసి 1,11,078 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఇందులో 50 వేలకు పైగా కేవలం సింగరేణి కార్మికులే ఉండటం విశేషం. 2018లో జరిగిన ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గంలో 1,64,405 మంది ఓటర్లుండగా.. 2023 ఎన్నికల నాటికి దాదాపు 20వేలకు పైగా కొత్త ఓటర్లు వచ్చారు.

మండలాల వారీగా ఓటర్లను పరిశీలిస్తే.. మందమర్రి మండలంలో  77,205 మంది ఓటర్లు..చెన్నూర్‌ మండలంలో 43,825 ఓటర్లు, కోటపల్లి మండలంలో 25,735 మంది ఓటర్లు, జైపూర్‌ మండలంలో 28,840 మంది ఓటర్లు, భీమారం మండలంలో 12,678 మంది ఓటర్లు, మొత్తం 1,88,283 మంది ఓటర్లు ఉన్నారు. దీంతో చెన్నూరు నియోజకవర్గం గెలుపోటములను డిసైడ్ చేసే మందమర్రి ఓటర్ల  వైపే అభ్యర్థుల చూపు పడుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =