స్టేషన్ ఘన్‌పూర్‌ సెంటిమెంట్‌ కోసం నేతల వర్కవుట్లు

Leaders Workouts for Station Ghanpur Sentiment,Station Ghanpur Assembly Constituency,Station Ghanpur Constituency,Station Ghanpur Mandal Political Map,Mango News,Mango News Telugu,Station Ghanpur Politics News,Station Ghanpur Politics News Today,Telangana Assembly Election 2023,Telangana Assembly Election Live Updates,Cm Kcr News And Live Updates, Telangna Congress Party, Telangna Bjp Party, Ysrtp,Trs Party, Brs Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Genaral Assembly Elections

జిల్లాలోని ప్రతీ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంటుందన్న విషయం తెలిసిందే. అలాగే ఓ సెంటిమెంట్‌ .. ఓ ఆనవాయితీ కూడా ఉంటుంది. కాకపోతే అది ఎన్నికల సమయంలోనే హాట్ టాపిక్‌గా మారుతూ ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ ఎస్‌సీ రిజర్వుడు సెగ్మెంట్‌ ఈ సారి మరోసారి చర్చకు వచ్చింది. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో.. ఆ పార్టీయే రాష్ట్రంలో కూడా  అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ కొన్నాళ్లుగా కొనసాగుతోంది. అయితే అధికార పార్ఠీలో రగులుకున్న అంతర్గత కలహాలు ఈ సారి అదే సెంటిమెంట్‌ను కొనసాగేలా చేస్తుందో లేదోనని భయం అధిష్టానాన్ని వెంటాడుతోంది.

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం.. ఒకప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లాలో.. ప్రస్తుతం జనగామ జిల్లాలో కొనసాగుతోంది. రాజకీయాల్లోనూ, సినీ ఇండస్ట్రీలోనూ సెంటిమెంట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో పాలిటిక్స్‌లో ఈ సెంటిమెంట్ మరీ బలంగా ఉంటుంది. అలా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో.. ఆ పార్టీనే రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది.

1978లో స్టేషన్ ఘన్ పూర్ ఎస్సీ రిజర్వుడుగా మారినప్పటి నుంచీ ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో జిల్లాలోని అన్ని పార్టీలు ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించాయి. స్టేషన్ ఘన్ పూర్ నుంచి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఏడు సార్లు.. టీడీపీ మూడు సార్లు.. బీఆర్ఎస్ ఉప ఎన్నికలతో సహా.. నాలుగు సార్లు విజయం సాధించింది.

తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో తాటికొండ రాజయ్య కారు పార్టీ అభ్యర్థిగా విజయం సాధించి.. కేసీఆర్ తొలి క్యాబినెట్‌లో తొలి ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2018లో కూడా డాక్టర్ రాజయ్య బీఆర్ఎస్ నుంచే విజయం సాధించారు. అప్పుడు బీఆర్ఎస్‌ పార్టీకే రెండోసారి పవర్  దక్కింది.  ఉపఎన్నికతో కలిపి వరుసగా 4 సార్లు విజయం సాధించిన రాజయ్య ఎమ్మెల్యేగా  రికార్డు సృష్టించారు. అయితే ఐదోసారి రాజయ్య తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశాన్ని గులాబీ బాస్ ఇవ్వలేదు.  ఈసారి ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని.. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి సీటు ఇచ్చారు.

టికెట్ రాకపోవడంతో రాజయ్య అసంతృప్తి రగలిపోయిన రాజయ్యను పార్టీ పెద్దలు ఒప్పించినా ఇప్పటికీ కడియం శ్రీహరితో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. చివరకు ఈ అంతర్గత తగాదాలతోనే  స్టేషన్‌ ఘన్‌పూర్‌లో జరగాల్సిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ అనూహ్యంగా వర్థన్నపేటకు మారింది. మరోవైపు కడియం  అభ్యర్థిత్వాన్ని బలమైన  మాదిగ సామాజిక వర్గం వ్యతిరేకించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దీంతో గులాబీ పార్టీలోని అంతర్గత  కలహాల అంశం నుంచి బయట పడటానికి బీఆర్ఎస్ అధిష్టానం ప్రయత్నిస్తుంటే..  కాంగ్రెస్ పార్టీ నేతలు ఇదే అంశాన్ని  క్యాష్ చేసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి చెక్ పెట్టడానికి దీంతో ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కడియం గెలుస్తారా? బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందా అనే ప్రశ్నలు పొలిటికల్  సర్కిల్‌లో వినిపిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + seven =