బీఆర్ఎస్ పాలనలో నిజంగా అలాగే జరిగిందా?

This is the Congress Youth Charge Sheet,This is the Congress Youth,Congress Youth Charge Sheet,Mango News,Mango News Telugu,T Congress, Congress Youth Charge Sheet, Telangana Assembly Elections 2023,BRS, Congress, Bjp,Youth Congress election results,Youth Charge Sheet Against BRS,NIA files charge sheet,Congress Youth Charge Sheet Latest News,BJP Latest News,BJP Latest Updates
T Congress, Congress Youth Charge Sheet, Telangana Assembly Elections 2023,BRS, Congress, Bjp,

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకు హీటును పుట్టిస్తున్నాయి.  కాంగ్రెస్ అన్ని వర్గాలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది. తమ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో పాటు.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ వర్గం  ఎలా మోసపోయిందీ వివరిస్తూ ముందుకు పోతోంది. అందులో భాగంగానే తాజాగా యూత్ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. విద్యకు చేసిన కేటాయింపులతో పాటు యువతకు ఇచ్చిన హామీల విషయంలో బీఆర్ఎస్ మోసం చేసిందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా పది అంశాలను ఈ ఛార్జ్ షీట్ లో చెబుతూ ఎన్నికలలోగా దీనిని ప్రజలలోకి గట్టిగా తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తోంది.

కాంగ్రెస్ ఈ సారి ఎన్నికల ప్రచారాన్ని వ్యూహాత్మకంగా కొనసాగిస్తోంది. మహిళలు, రైతులను ఆకట్టుకునేలా  ఎన్నికల ప్రచార సభల్లో హామీలు గుప్పిస్తోంది.  బీఆర్ఎస్ హయాంలో యువత ఏ విధంగా నష్టపోయిందీ వివరిస్తూ..వారి మద్దతు కూడగట్టుకొనే ప్రయత్నాలను చేస్తోంది. అందులో భాగంగా తాజాగా  విడుదల చేసిన యూత్ చార్జ్ షీట్‌లో.. తొలి సారి ప్రభుత్వం ఏర్పాటు  చేసిన 2014  నుంచి.. ఇప్పటి వరకు విడుదల చేసిన నిధుల గురించి వివరించింది. 2014-15 బడ్జెట్ లో విద్యా రంగానికి 10.89 శాతం నిధులను కేటాయించిన తెలంగాణ సర్కార్..2023-24 బడ్జెట్ అంచనాల్లో 7.6 శాతానికి తగ్గించారనన్న విషయాన్ని హైలెట్ చేసింది. అంతేకాదు ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ సర్కార్ ఇచ్చిన హామీల వైఫల్యాల గురించి ప్రస్తావించింది.

2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్.. తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కేజీ టూ పీజీ ఉచిత చదువు పైన హామీ ఇచ్చారు. కానీ, ఈ  9 ఏళ్ల కాలంలో కొత్తగా ఒక్క తరగతి గదిని కూడా నిర్మించలేదని కాంగ్రెస్ ఛార్జ్ షీటులో ఆరోపించింది. గంభీరావు పేటలో కేజీ టూ పీజీ సంస్థ నిర్మించినా..అది సీఎస్ఆర్ నిధులతో జరిగిన నిర్మాణమని చెప్పుకొస్తుంది. అలాగే ప్రతీ ఇంటికి ఒక ఉద్యోగం పేరుతో తెలంగాణ సర్కార్ యవతకు అబద్దాలు చెప్పిందని ఆరోపించింది.

బిశ్వాల్ నివేదిక ప్రకారం గవర్నమెంట్ శాఖల్లో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలలో ఖాళీలు ఉన్నాయని.. 60 శాతం ఉద్యోగులతో నడుస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని.. 60 శాతం సర్కార్‌ గా ఛార్జ్ షీట్లో కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. అలాగే 2014-21 మధ్య కాలంలో దాదాపుగా 3,600కు పైగా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఛార్జ్ షీటలో కాంగ్రెస్ పేర్కొంది.

2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని ఇప్పటికీ తెలంగాణ సర్కార్ నెరవేర్చలేదని కాంగ్రెస్ పార్టీ తమ ఛార్జ్ షీట్‌లో గుర్తు చేసింది. దీని ద్వారా ఒక్కో ఉద్యోగికి రూ 1,74,928 చొప్పున బీఆర్ఎస్ ప్రభుత్వం బాకీ పడినట్లు అంటూ వివిరించింది. బీఆర్ఎస్ అసమర్ధ పాలన వల్ల.. యువత మద్యం, జూదం, డ్రగ్స్ కు బానిస అయ్యారని  ఆరోపించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 12 =