కోటీశ్వరులలో ఎక్కువ మంది బీఆర్ఎస్ అభ్యర్థులే

These are the millionaires who are contesting in this election,These are the millionaires,who are contesting in this election,millionaires who are contesting,Election contesting,millionaires are contesting ,election,Mango News,Mango News Telugu, BRS candidates,Telangana Assembly Elections 2023,BRS, Congress, Bjp,BRS candidates Latest News,BRS candidates Latest Updates,Telangana Assembly Elections Latest News,Telangana Assembly Elections Latest Updates
millionaires are contesting ,election, BRS candidates,Telangana Assembly Elections 2023,BRS, Congress, Bjp,

ఎన్నికలు అంటేనే డబ్బుల ప్రవాహం. రాజకీయాల్లో అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేసేది ఎక్కువ శాతం డబ్బే . బ్యాలెట్ బాక్స్ నుంచి ప్రజా సేవకుడు ప్రజా ప్రతినిధిగా వస్తాడని అప్పుడెప్పుడో అంబేద్కర్ చెప్పిన మాటలు కాస్తా..ఇప్పుడు డబ్బు సంచుల నుంచి ప్రజాప్రతినిధి వస్తాడు’ అనే  ప్రచారంగా మారిపోయింది.

అందుకేనేమో ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ దాదాపు ఎక్కువ ఖర్చు పెట్టగలిగిన వాళ్లకే టికెట్లను కేటాయించారు. అలా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాలలో నిలబడ్డ కోటీశ్వరుల గురించి చర్చ జరుగుతోంది. వీరిలో ఎక్కువ మంది బీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తున్నారు.

కొల్లాపూర్​ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కోటీశ్వరుడు.. బీఆర్​ఎస్ తరపున పోటీచేస్తున్న​ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి. హర్షవర్ధన్ రెడ్డికి ఫ్యామిలీ మెంబర్స్‌తో  కలిపి రూ.11.82 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి. అలాగే ఆయనకు రూ.3.05 కోట్లు బ్యాంకు రుణాలు ఉన్నాయి.

వనపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్​​ అభ్యర్థి బీరం మేఘారెడ్డి కూడా కోటీశ్వరుడు. ఆయనకు కుటుంబంతో కలిపి ఏకంగా రూ.18.15 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి.అలాగే  మేఘారెడ్డికి రూ.3.40 కోట్లు బ్యాంకు రుణాలు ఉన్నాయి.

మరోవైపు నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కోటీశ్వరుడు.. బీఆర్​ఎస్​​​ అభ్యర్థి  మర్రి జనార్దన్‌ రెడ్డి. ఆయనకు కుటుంబంతో కలిపి రూ.112.23 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి.దీంతో పాటు ఆయను రూ.26.52 కోట్లు బ్యాంకు లోన్స్ ఉన్నాయి.

అటు వనపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న  కోటీశ్వరుడు..  బీఆర్​ఎస్​​​ అభ్యర్థి నిరంజన్ రెడ్డి. ఆయనకు కుటుంబ సభ్యులతో కలిపి రూ.7.98 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి. అలాగే రూ.1.06 కోట్లు బ్యాంకు రుణాలు ఉన్నాయి.

నారాయణపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మరో  కోటీశ్వరుడు..బీఆర్​ఎస్​​​ అభ్యర్థి రాజేందర్‌ రెడ్డి.  ఆయనకు తన కుటుంబంతో కలిపి రూ.110.15 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి.అలాగే రూ.10.48 కోట్లు బ్యాంకు రుణాలు ఉన్నాయి.

కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఇంకో కోటీశ్వరుడు..  కాంగ్రెస్​​​​ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి.  ఆయనకు తన కుటుంబంతో కలిపి రూ.63.58 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి.ఆయనకు కూడా రూ.6.87 కోట్లు బ్యాంకు రుణాలు ఉన్నాయి.

ముక్తల్​ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కోటీశ్వరుడు..  బీజేపీ​​​​ అభ్యర్థి జలంధర్‌రెడ్డి. ఆయనకు..తన కుటుంబంతో కలిపి రూ.45.89 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి. జలంధర్ రెడ్డికి కూడా రూ.8.86 కోట్లు బ్యాంకు రుణాలు ఉన్నాయి.

దేవరకద్ర​ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మరో కోటీశ్వరుడు..బీఆర్​ఎస్​​​​​ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి. ఆయనకు తన  కుటుంబంతో కలిపి రూ.73.60 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి . అంతేకాదు రూ.7.38 కోట్లు బ్యాంకు రుణాలు కూడా ఉన్నాయి.

జడ్చర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఇంకో  కోటీశ్వరుడు..  కాంగ్రెస్​​​​​ అభ్యర్థి అనిరుధ్‌రెడ్డి. ఆయన కుటుంబంతో కలిపి రూ.47.45 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి.అనిరుధ్ రెడ్డికి బ్యాంకు రుణాలు ఏమీ లేవు. జడ్చర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మరో కోటీశ్వరుడు..  బీఆర్ఎస్​ అభ్యర్థి అయిన లక్ష్మారెడ్డి. ఆయనకు తన కుటుంబంతో కలిపి రూ.32.87 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి.  లక్ష్మారెడ్డికి  రూ.15.12 కోట్లు బ్యాంకు రుణాలు ఉన్నాయి.

మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కోటీశ్వరుడు..  బీఆర్ఎస్​ అభ్యర్థి శ్రీనివాస్‌ గౌడ్‌. ఆయనకు తన కుటుంబంతో కలిపి రూ.23.10 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి. శ్రీనివాస్‌ గౌడ్‌ కు కూడా రూ.3.33 కోట్లు బ్యాంకు రుణాలు ఉన్నాయి.

మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మరో కోటీశ్వరుడు..  కాంగ్రెస్​​ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి.  ఆయనకు తన కుటుంబంతో కలిపి రూ.4.84 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి. ఎటువంటి బ్యాంకు రుణాలు లేవు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + three =