నామినేషన్లను విత్ డ్రా చేసుకున్న రెబల్స్ ..

Rebels who withdrew their nominations,Rebels who withdrew,Withdrew their nominations,Rebels nominations,Mango News,Mango News Telugu,Congress, Rebels withdrew their nominations,nominations,Rebels, T Congress, Telangana Assembly Elections 2023,BRS, Congress, Bjp,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Assembly Elections Latest News,Telangana Assembly Elections Latest Updates,T Congress Latest News,T Congress Latest Updates
Congress, Rebels withdrew their nominations,nominations,Rebels, T. Congress, Telangana Assembly Elections 2023,BRS, Congress, Bjp,

రెబల్ లీడర్లను బుజ్జగించి దారికి తెచ్చుకోవడంలో కాంగ్రెస్ పెద్దలు సక్సెస్ అయ్యారు. టికెట్ ఆశించి భంగపడ్డ కొంతమంది కాంగ్రెస్ నేతలు రెబల్స్‌గా  నామినేషన్లు దాఖలు చేశారు. తమను కాదని.. పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చేది లేదని.. తాము  పోటీలోనే ఉంటామని చెప్పేసారు. దీంతో ఈ సారి అధికారమే లక్ష్యంగా  స్ట్రాటజీతో ముందుకెళ్తున్న కాంగ్రెస్‌కు రెబల్ నేతలు కొత్త సమస్యగా మారారు.

రెబల్ నేతలు నామినేషన్లను విత్ డ్రా చేసుకోకపోతే పార్టీ ఓట్లు చీలిపోవడమే కాకుండా.. బీఆర్ఎస్‌కు ప్లస్ అవుతుందనే లెక్కలతో ఈ అంశంపై హై కమాండ్ సీరియస్‌గా దృష్టి సారించింది. నామినేషన్ల ఉపసంహరణకు నిన్న చివరి తేదీ కావడంతో రెబల్ నేతలను బుజ్జగించేందుకు మధ్యవర్తులను రంగంలోకి దింపి.. ఎలాగైనా వారితో నామినేషన్లు విత్ డ్రా చేయించాలని ఆదేశించింది. ఏఐసీసీ ఆదేశాలతో రెబల్ నేతలతో  మాట్లాడి వారిని కాంప్రమైజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అలా తెలంగాణ వ్యాప్తంగా  ముఖ్యమైన నియోజకవర్గాల నుంచి ఆయా నేతలతో నామినేషన్లు విత్ డ్రా చేయించారు.

సూర్యాపేటకు చెందిన పటేల్ రమేష్ రెడ్డి.. ఈసారి సూర్యాపేట అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని ఆశపడ్డారు. కానీ అధిష్టానం రమేష్ రెడ్డిని కాదని మాజీ మంత్రి, సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డికి టికెట్  కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన పటేల్ రమేష్ రెడ్డి.. ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఏఐసీసీ ఆదేశాలతో రంగంలోకి దిగిన  రోహిత్ చౌదరి, మల్లు రవి..  పటేల్ రమేష్ రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్  అధికారంలోకి వస్తే ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి  ఆయనతో నామినేషన్ విత్ డ్రా చేసేలా చేశారు. అధిష్టానం హామీతో వెనక్కి తగ్గిన రమేష్ రెడ్డి..తన నామినేషన్ ఉపసంహరించుకుని, రాంరెడ్డి దామోదర్ రెడ్డికి సపోర్ట్ చేస్తానని ప్రకటించారు.

అలాగే బాన్సువాడ టికెట్ ఆశించి భంగపడ్డ కాసుల బాలరాజు .. అధిష్టానం టికెట్ నిరాకరించడంతో రెబల్‌గా నామినేషన్ దాఖలు చేశారు. తనను కాదని పార్టీ టికెట్ వేరేవారికి  కేటాయించిన సమయంలో బాలరాజు ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. దీంతో నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ అవడంతో నిన్న కాంగ్రెస్ పెద్దలు బాలరాజుతో చర్చించడంతో.. బాలరాజు నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంచి పదవి ఇస్తామని పెద్దలు హామీ ఇవ్వడంతో.. బాలరాజు తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అలా  జుక్కల్‌లో గంగారాం, వరంగల్ వెస్ట్‌లో జంగా రాఘవ రెడ్డి, డోర్నకల్‌లో నెహ్రు నాయక్, ఇబ్రహీం పట్నంలో దండెం రామిరెడ్డిలతో నామినేషన్లు విత్ డ్రా చేయించడంలో కాంగ్రెస్ పార్టీ సఫలం అయింది. రెబల్స్ బాధ తప్పడంతో.. ఫోకస్ అంతా ప్రచారంలో ముందుకు వెళ్లడానికి,ఎలా అయినా తెలంగాణలో ఈసారి అధికారం చేజిక్కించుకోవడానికి సిద్ధమవుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =