టీపీసీసీ కీలక నిర్ణయం.. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని ఎంపిక చేయాలనే తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం

TPCC Chief Revanth Reddy Announces Resolution Passes For Rahul as Congress President in Party Extended Meeting, Rahul Gandhi , Aicc President, TPCC's Key Decision, TPCC Resolution on Aicc President, Aicc President Rahul Gandhi, Rahul Gandhi Aicc President, Mango News, Mango News Telugu, TPCC Congress President, TPCC Decision on Aicc President, All India Congress Committee , Indian National Congress, Sonia Gandhi

ఏఐసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఎంపిక చేయాలనే టీపీసీసీ తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఈ మేరకు బుధవారం టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాగా సమావేశంలో రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నిక కావాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తొలుత పార్టీ తరపున తీర్మానం ప్రవేశ పెట్టగా మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ దీనిని బలపరిచారు. ఇక మాజీ మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టగా, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆ రాజకీయ తీర్మానాన్ని బలపరిచారు. అలాగే సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ గీతారెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహా, సీనియర్ నేత వి. హనుమంతరావు, మహేష్ కుమార్ గౌడ్ తదితరులు ఈ తీర్మానాలను బలపరిచారు. కాగా దీనిని టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశం తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లో ఉందని, ఈ సమయంలో దేశాన్ని కాపాడేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని తెలిపారు. దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడి రాహుల్ పాదయాత్ర చేస్తున్నారని, అందుకే ఆయనకు మనమంతా మద్దతుగా నిలవాలని శ్రేణులకు, నాయకులకు ఆయన పిలుపునిచ్చారు. కాగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటూ పీసీసీలు ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాయని, ఇదేక్రమంలో తెలంగాణ పీసీసీ కూడా ఈరోజు రాహుల్ గాంధీని ఏఐసీసీ అధ్యక్షుడిగా నియమించాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టామని, నాయకులందరూ ముక్త కంఠంతో ఏకగ్రీవంగా ఆమోదించారని వెల్లడించారు. ఈ తీర్మాన ప్రతిని ఏఐసీసీకి పేమించనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 9 =