వరంగల్ జిల్లా అక్కంపేటలో ‘రైతు రచ్చబండ’ నిర్వహించిన టీ-కాంగ్రెస్.. హాజరైన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

TPCC Chief Revanth Reddy Attends Rachabanda Programme by T Congress at Akkampeta Warangal, TPCC Chief Revanth Reddy Attends Rachabanda Programme by T Congress at Warangal, TPCC Chief Revanth Reddy Attends Rachabanda Programme by T Congress at Akkampeta, Rachabanda Programme by T Congress at Warangal, Rachabanda Programme by T Congress at Akkampeta, TPCC Chief Revanth Reddy, Telangana Pradesh Congress Committee, Telangana Congress Committee President Revanth Reddy, Telangana Pradesh Congress Committee Chief Revanth Reddy, TPCC President Revanth Reddy, Revanth Reddy, T Congress, Revanth Reddy President of Telangana Pradesh Congress Committee, T Congress Rachabanda Programme News, T Congress Rachabanda Programme Latest News, T Congress Rachabanda Programme Latest Updates, T Congress Rachabanda Programme Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ‘రైతు రచ్చబండ’ కార్యక్రమం నిర్వహిస్తోంది. రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని టీపీసీసీ మే 21 నుండి నెలరోజుల పాటు రైతు రచ్చబండ నిర్వహిస్తోంది. కాగా రాష్ట్రంలోని 1200కు పైగా గ్రామాల్లో రచ్చబండ చేపట్టేందుకు టీపీసీసీ ప్రణాళిక రచించింది. ఇటీవలి వరంగల్ రైతు డిక్లరేషన్‌ను రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి చేర్చేలా ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ రూపకల్పన చేసింది. దీనిని విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ సొంతూరైన ఆత్మకూరు మండలంలోని అక్కంపేటలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ‘రైతు రచ్చబండ’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

దీనిలో భాగంగా ముందుగా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‌కు చేరుకున్న రేవంత్ రెడ్డి సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. అనంతరం అగ్రంపహాడ్ నుంచి అక్కంపేట వరకూ రేవంత్ రెడ్డి పాదయాత్రగా బయలుదేరారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల సాధన కొరకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని, సమాజంలోని అట్టడుగు వర్గాలకు, నిరుపేదలకూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందినప్పుడే అది ప్రగతి పథంలో పయనిస్తుందని చెప్పగలమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకూ న్యాయం జరిగే వరకూ పోరాడతామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వరంగల్ లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కంపేటను దత్తత తీసుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − nine =