మునుగోడు ఉపఎన్నిక: ఈసీ కీలక నిర్ణయం, సరికొత్త సెక్యూరిటీ ఫీచర్స్‌తో ఓటర్‌ గుర్తింపు కార్డుల జారీ

Munugode By-poll SEC To be Distributed New EPIC Card with Additional Security Features For Voters, Munugode By-poll , SEC To be Distributed New EPIC Card, Additional Security Features For Voters, Mango News, Mango News Telugu, EPIC Card, Munugode EPIC Voter Card, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates

మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక వేళ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా హోలోగ్రామ్‌తో సహా ఆరు భద్రతా ఫీచర్లతో కూడిన కొత్త ఓటర్‌ గుర్తింపు కార్డ్‌ (ఈపీఐసీ)లను జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కొత్త ఫీచర్స్‌తో కూడిన కొత్త డిజైన్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆమోదించిందని, ఈ నేపథ్యంలో మొదట వీటిని మునుగోడులో కొత్తగా నమోదైన ఓటర్లు మరియు ఇంతకుముందు గుర్తింపు కార్డులు పొందని ఓటర్లకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. డేటా భద్రతను నిర్ధారించడానికి భారత ఎన్నికల సంఘం ఇటీవల ఓటరు గుర్తింపు కార్డుల యొక్క కొత్త సవరించిన డిజైన్‌కు ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు.

అన్ని భద్రతా ఫీచర్లతో కూడిన ఈ కొత్త ఓటర్ కార్డ్‌లు అందరికీ ఉచితంగా పంపిణీ చేయబడతాయని, ఈ కార్డులను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిణీ చేస్తున్నామని ఆయన వివరించారు. కాగా ఈ ఎన్నికల్లో నిఘా, పారదర్శకత పెంచేందుకు నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో లైవ్ వీడియో వ్యూయింగ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు. రాజకీయ పార్టీలు, ఏజెంట్లు, అభ్యర్థులు ప్రజలు నామినేట్‌ చేసి కంట్రోల్‌ రూమ్‌ను వినియోగించుకోవాలని, ఇది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని సీఈవో వికాస్‌రాజ్‌ తెలిపారు. ఇక మునుగోడులో ఎన్నికలకు సంబంధించిన కఠినమైన నిఘా పెట్టామని, ఇప్పటివరకు వివిధ కేసుల్లో 19 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని సీఈవో తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత రూ 2.70 కోట్లు స్వాధీనం చేసుకున్నామని, ఎక్సైజ్ శాఖ ఇప్పటివరకు 94 కేసులు నమోదు చేసి 44 మందిని అరెస్టు చేసిందని వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − two =