ఎమ్మెల్యేల కొనుగోలులో రూ. 100 కోట్ల లెక్క తేల్చండి, ఈడీని కోరిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు

TRS MLAs Purchase Case BJP MLA Raghunandan Rao Approaches ED To Need Inquiry on Allegations of Rs 100 Cr Bribe, BJP MLA Raghunandan Rao Approaches ED, TRS MLAs Purchase Case, Mango News, Mango News Telugu, 4 TRS MLAs Poaching Incident, TRS MLA Balaraju, TRS MLA Rega Kantarao, TRS MLA Harshavardhan Reddy, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates

తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పూటకో మలుపు తిరుగుతూ ఆసక్తి రేకెత్తిస్తోంది. దీనివెనుక బీజేపీ ఉందని ఆరోపణలు రావడంతో ఆ పార్టీ నేతలు టీఆర్ఎస్‌పై మండిపడుతున్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ ఆడిస్తున్న డ్రామా అని, దీనిలో తమకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. ఒకవైపు దీనిపై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసి ఈ కేసుని కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని, అలాగే కోర్ట్ పర్యవేక్షణలో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి ఎంక్వయిరీ చేయించాలని కోరారు. మరోవైపు శుక్రవారం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఎదుట ప్రమాణం కూడా చేశారు.

ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు మరో అడుగు ముందుకేశారు. శుక్రవారం ఆయన ఈడీ ఆఫీసుకి వెళ్లారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా వెలుగుచూసిన ఈ వ్యవహారంలో ఈడీ జోక్యం చేసుకోవాలని రఘునందన్‌ రావు కోరినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఎమ్మెల్యేల కొనుగోలుకు ఒక్కొక్కరికి రూ. 100 కోట్లు ఆఫర్ చేశారని చెప్పారని, దీనికి సంబంధించి ఆ డబ్బుపై లెక్క తేల్చాలని ఈడీ అధికారులని కోరినట్లు సమాచారం. అసలు ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందని, అది ఎవరికి సంబంధించినదనేది విచారణ చేపట్టాలని కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం ముందుముందు ఇంకెన్ని మలుపులు తిరగనుందో వేచిచూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + eight =