టీ20 ప్రపంచ కప్-2022: వర్షం వలన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ రద్దు, వర్షంతో రద్దైన మ్యాచ్ లు ఇవే…

T20 World Cup-2022: Group 1 Match Between Australia and England was Called off After Persistent Rain, T20 World Cup-2022, T20 World Cup Group 1 Match, Australia and England Match Called Off, Mango News,Mango News Telugu, Melbourne Cricket Ground,T20 World Cup 2022, AUS vs ENG,Australia vs England Washed Out, ICC Twenty20 World Cup, Rain Washes Out Australia Vs England,Australia Vs England T20 World Cup, T20 World Cup 2022 Latest News And Updates

అక్టోబర్ 16 నుంచి టీ20 ప్రపంచ కప్-2022 ఆస్ట్రేలియాలో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సూపర్-12 రౌండ్ మ్యాచులు జరుగుతుండగా, పలు మ్యాచ్ లకు వర్షం అంతరాయం కలిగిస్తుంది. వర్షం కారణంగా కొన్ని మ్యాచులు పూర్తిగా రద్దు అవుతుండగా, మరి కొన్ని మ్యాచ్ లలో వర్షం ఫలితాల్ని ప్రభావితం చేస్తుంది. నేడు (అక్టోబర్ 28, శుక్రవారం) సూపర్-12లో భాగంగా గ్రూప్-1 లో ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగాల్సిన కీలక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అలాగే నేడు మెల్‌బోర్న్‌లో ఆఫ్ఘనిస్తాన్ మరియు ఐర్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా ఎడతెగని వర్షం కారణంగా రద్దు చేయబడింది.

వర్షం కారణంగా మ్యాచ్ లు రద్దు కావడంతో ఆయా జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తున్నారు. కీలక మ్యాచ్ లు కొన్ని వర్షం వలన రద్దు అవుతుండముతో క్రికెట్ అభిమానులు నిరాశకు గురవుతుండగా, మరోవైపు సెమీస్ అవకాశాలపై ప్రభావం పడుతుండడంతో ఆ జట్లలో ఆందోళన నెలకుంది. సూపర్-12లో ఇప్పటికి గ్రూప్-1 లో ఉన్న ఇంగ్లాండ్‌ 3 పాయింట్లతో, ఆస్ట్రేలియా 3, న్యూజిలాండ్ 3, ఐర్లాండ్ 3, ఆఫ్ఘనిస్థాన్ 2, శ్రీలంక 2 పాయింట్లు సాధించగా, గ్రూప్‌-2 లో భారత్‌ 4, దక్షిణాఫ్రికా 3, జింబాంబ్వే 3, బంగ్లాదేశ్ 2 పాయింట్లు సాధించాయి. పాకిస్థాన్‌, నెదర్లాండ్స్ జట్లు ఇంకా ఖాతా తెరవలేదు.

టీ20 ప్రపంచ కప్-2022 లో ఇప్పటికి వర్షం వలన రద్దయిన మ్యాచ్ లు ఇవే:

  • అక్టోబర్ 24 గ్రూప్-2: దక్షిణాఫ్రికా, జింబాంబ్వే జట్ల మధ్య మ్యాచ్ రద్దు
  • అక్టోబర్ 26 గ్రూప్-1: న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ రద్దు, అలాగే వర్షం కారణంగా ఇంగ్లాండ్‌, ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో డిఎల్ఎస్ మెథడ్ ద్వారా ఐర్లాండ్ విజయం.
  • అక్టోబర్ 28 గ్రూప్-1: ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ జట్ల మధ్య మరియు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల జరగాల్సిన మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + twelve =