య‌శోద ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన సీఎం కేసీఆర్, వారం రోజులు విశ్రాంతి సూచించిన వైద్యులు

Telangana CM KCR Discharge From Somajiguda Yashoda Hospital After Medical Check-up, CM KCR Discharge From Somajiguda Yashoda Hospital After Medical Check-up, CM KCR Discharge From Somajiguda Yashoda Hospital, Telangana CM KCR Goes To Yashoda Hospital At Somajiguda Due To Slight Illness, Telangana CM KCR Goes To Yashoda Hospital At Somajiguda, Telangana CM KCR Goes To Yashoda Hospital Due To Slight Illness, CM KCR, Telangana CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, KCR, KCR Health, KCR Health Latest News, KCR Health Latest Updates, KCR Health Live Updates, Yashoda Hospital At Somajiguda, Mango News, Mango News Telugu,

హైదరాబాద్ సోమాజిగూడ‌లోని య‌శోద ఆస్ప‌త్రి నుంచి సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు (శుక్రవారం) ఉదయం సీఎం కేసీఆర్ స్వల్ప అనారోగ్య లక్షణాలతో య‌శోద ఆస్ప‌త్రికి చేరుకున్న విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా కేసీఆర్ కొంచెం నలతగా ఉంటున్నారని వైద్యులు కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో.. ప‌లు ర‌కాల వైద్య ప‌రీక్ష‌లు నిర్వహించామని వారు పేర్కొన్నారు. అయితే, వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం కేసీఆర్‌కు స‌ర్వైక‌ల్ స్పాండిలోసిస్ అని నిర్ధారించామ‌ని వారు తెలిపారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రికి సూచించామ‌ని సూచించారు.

ఈ సందర్భంగా.. సీఎం కేసీఆర్‌కు ఏ విధమైన హృదయ సంబంధిత స‌మ‌స్య‌లు లేవ‌ని య‌శోద ఆస్ప‌త్రి వైద్యులు ఫిజిషీయ‌న్ ఎంవీ రావు, కార్డియాల‌జిస్ట్ ప్ర‌మోద్ కుమార్ వెల్లడించారు. వైద్య ప‌రీక్ష‌లు ముగిసిన అనంత‌రం కేసీఆర్‌ను కాసేపు అబ్జ‌ర్వేష‌న్‌లో ఉంచి డిశ్చార్జి చేశారు. య‌శోద నుంచి ఆయన నేరుగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు పయనమయ్యారు. యశోదాలో.. డాక్టర్ ఎంవీ రావు నేతృత్వంలో కేసీఆర్‌కు యాంజియోగ్రామ్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, రక్త ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఆ రిపోర్ట్స్ అన్ని నార్మ‌ల్‌గానే ఉన్నాయ‌ని వైద్యులు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ వెంట ఆయ‌న కుటుంబ సభ్యులు.. స‌తీమ‌ణి శోభ‌, కుమారుడు కేటీఆర్, కూతురు క‌విత‌, మ‌నుమ‌డు హిమాన్షు, మంత్రి హ‌రీశ్‌రావు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − seven =