మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌

Union FM Nirmala Sitharaman Responds Over Minister Harish Rao Comments, Sitharaman Remarks on Ts Funds And Plans, FM Nirmala Sitharaman , Union Finance Minister Nirmala Sitharaman, Nirmala Sitharaman Reacts on Harish Rao Comments, Mango News, Mango News Telugu, Finance Minister Nirmala Sitharaman, Telanagna Minister Harish Rao, BJP Party, TRS Party, National Politics, Telangana News And Live Updates

తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మరోసారి కేసీఆర్‌ సర్కార్‌పై విమర్శలు చేశారు. శనివారం కామారెడ్డి జిల్లా గాంధారిలో రైతులతో ఆమె సమావేశమయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన రుణమాఫీ పథకం గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజన ద్వారా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నానని, తెలంగాణలోని జిల్లాల్లో పర్యటించడం వలన చాలా విషయాలు తెలుసుకున్నానని చెప్పారు. అన్నదాతలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ హామీ ఏమైందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తామని నాడు హామీ ఇచ్చారని, నేడు మాత్రం 100 మందిలో కేవలం 5గురికే అందిస్తున్నారని మండిపడ్డారు.

ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌.. రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు. మంత్రి హరీష్ రావు వ్యంగంగా మాట్లాడటం సరికాదని, నిన్న నేనేం మాట్లాడానో ముందు ఆయన పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. రాష్ట్ర మంత్రులు నిజాలు తెలుసుకొని మాట్లాడాలని, కేంద్రం 60 శాతం నిధులు ఇస్తుంటే.. రాష్ట్రాలు 40 శాతం భరించాలని తెలిపారు. తెలంగాణకు కేంద్రం పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చినా రాష్ట్రం తన వాటా ఇవ్వకపోవడంతో అనేక ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. కేంద్రం వాటా ఉన్న పథకాలకు కేంద్రం పేరు పెట్టాల్సిందేనన్న కేంద్ర మంత్రి, రాష్ట్రం వాటా ఇవ్వగానే కేంద్రం కూడా తన వాటా నిధులు విడుదల చేస్తోందని తెలిపారు. ఇక ఆదిలాబాద్‌లో ఉన్న ప్రాజెక్ట్‌కు హైదరాబాద్‌ ఎంపీ ఫొటో పెడతారా? 2021 వరకు తెలంగాణ రాష్ట్రం కేంద్రం ఆధ్వర్యంలోని ‘ఆయుష్మాన్‌ భారత్‌’లో ఎందుకు చేరలేదు? అని ప్రశ్నించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =