వచ్చే ఎన్నికల్లో నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిస్తాం, ఎంపీ అరవింద్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత

TRS MLC Kalvakuntla Kavitha Fires on Nizamabad BJP MP Dharmapuri Aravind,TRS MLC Kalvakuntla Kavitha,BJP MP Dharmapuri Aravind,Nizamabad BJP MP,Mango News,Mango News Telugu,MP Dharmapuri Arvind,MP Dharmapuri Arvind,MLC Kalvakuntla Kavitha,Dharmapuri Arvind,Kalvakuntla Kavitha,BJP MP Dharmapuri Aravind Latest News And Updates,Kalvakuntla Kavitha News And Updates,Kalvakuntla Kavitha Liqour Scam Case,Delhi Liqour Scam Case

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీలోని శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ పలు పరుష వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అరవింద్‌పై కవిత చేసిన వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే.. ‘నిజామాబాద్ కు ఎంపీ గా అరవింద్ అనే ఆణిముత్యం ఉన్నారు. ఆయనది సంకుచిత మనస్తత్వం, చిల్లర మాటలు చెబుతుంటారు. అరవింద్ కాంగ్రెస్‌ మద్దతుతో అనుకోకుండా ఎంపీ అయ్యారు. నిజామాబాద్ ఎంపీగా అరవింద్ లాంటి వ్యక్తి ఉండటం దురదృష్టకరం, పార్లమెంటులో ఆయన పనితనం సున్నా. పసుపు బోర్డు తెస్తానని నియోజకవర్గ రైతులను మోసం చేశారు. అరవింద్‌ది ఫేక్ డిగ్రీ, దీనిపై నేను రాజస్థాన్ యూనివర్సిటీ కి పిర్యాదు చేస్తాను. ఆయన బురద లాంటోడు, నిన్న ప్రెస్ మీట్‌లో చాలా నీచంగా మాట్లాడారు’ అని అన్నారు.

ఇంకా ఆమె మాలాడుతూ.. ‘ఎంపీ అరవింద్ భాష చూస్తుంటే ఇలాంటి రాజకీయాలు అవసరమా అనిపిస్తోంది, చాలా బాధేస్తుంది. నేను ఎప్పుడూ సమస్యల మీదే మాట్లాడతాను, వ్యక్తులపై ఎపుడూ మీద మాట్లాడలేదు. కానీ అరవింద్ తీరు చూసి మాట్లాడక తప్పడం లేదు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ తప్పదు, మళ్లీ నా గురించి, పార్టీ మారడం గురించి మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో ఆయనకు ఇదే జరుగుతుంది. ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చినందుకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెబుతున్నా. ఇక అరవింద్ ఎక్కడ పోటీ చేసినా వెంటాడి పోటీ చేసి మరీ ఓడిస్తాను. కాంగ్రెస్ లో చేరేందుకు నేను ఖర్గేతో మాట్లాడాను అనేది శుద్ధ తప్పు, తెలంగాణ వాసన లేని పార్టీల్లో నేనెలా చేరుతాను? అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. నా జీవితంలో నేను నమ్మే ఏకైక నాయకుడు కేసీఆర్, నా రాజకీయ ప్రయాణం ఆయనతోనే. నాకు బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చిన మాట నిజమే, అయితే షిండే మోడల్ ఇక్కడ అమలు చేయడంపై వారు మాట్లాడారు. తెలంగాణలో షిండే మోడల్ నడవదు, జై మోదీ అనే వారిపైన ఈడీ దాడులు ఉండవు, అలాగే ఐటీ, సీబీఐ దాడులు కూడా ఉండవు అని బీహార్ మాజీ సీఎం లాలూ యాదవ్ ఎపుడో చెప్పారు. ఇలాంటివాటికి భయపడేది లేదు, జాతీయ రాజకీయాలోకి కచ్చితంగా వెళతాం. అరవింద్ సీఎం కేసీఆర్ పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక అడబిడ్డగా కొన్ని మాటలను వినలేకపోయాను. అందుకే ఈరోజు నేను ఆవేదనతో ఇలా మాట్లాడతున్నా’ అని అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + four =