కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి, ప్రధాని మోదీని కోరిన మంత్రి కేటీఆర్

Minister KTR Request PM Modi to Set up Separate OBC Ministry at Centre,Ministry of OBC, Minister KTR asked PM Modi,Minister KTR,PM Modi,Mango News,Mango News Telugu,OBC Ministry,OBC Minister in Central Govt,Central Govt OBC Ministry,Telangana Minister KTR, Minister KTR Latest News And Updates,Minister KTR,PM Narendra Modi,PM Modi News and Live Updates, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls

కేంద్రంలో ఓబీసీకి ప్రత్యేకంగా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ కోరారు. ఓబీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటుకు సంబంధించి గతంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ ను, అనంతరం ప్రధాని మోదీకి చేసిన విజ్ఞప్తులపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ అంశంపై గతంలో మన్మోహన్ సింగ్ ను కేసీఆర్ ఆధ్వర్యంలో ఓబీసీ సంఘాలు కలిసిన పోటోలను కూడా కేటీఆర్ షేర్ చేశారు. “2004, డిసెంబర్ 18న కేసీఆర్ ఓబీసీ సంఘాల ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించి, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసి ఓబీసీ సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. దురదృష్టవశాత్తు ఈ డిమాండ్‌ను యూపీఏ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు” అని మంత్రి కేటీఆర్ అన్నారు.

“ఓబీసీల డిమాండ్‌ను సానుకూలంగా పరిగణించాలని మేము ప్రధానమంత్రి నరేంద్రమోదీని కూడా అభ్యర్థించాము. రాబోయే బడ్జెట్ 2023లో ఎన్డీఏ ప్రభుత్వం తగిన బడ్జెట్ కేటాయింపులతో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తుందని ఆశిస్తున్నాము” మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 5 =