తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్, శ్రీజ ఆకుల అర్జున అవార్డుకు ఎంపిక కావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం

CM KCR Expressed Delight that Telangana's Nikhat Zareen and Sreeja Akula have been Selected for the Arjuna Award,CM KCR Praised Nikhat Zareen,KCR Praises Sreeja Akula, Nikhat Zareen Arjuna Award,Sreeja Akula Arjuna Award, Arjuna Award Nikhat Zareen,Arjuna Award Sreeja Akula,Mango News,Mango News Telugu,Arjuna Award 2023,Arjuna Award Latest News And Updates,Arjuna Awards,Nikhat Zareen,Sreeja Akula

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే జాతీయ క్రీడా అవార్డులు-2022 ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన బాక్సర్ నిఖత్ జరీన్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి శ్రీజ ఆకుల అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో క్రీడల్లో ప్రతిభావంతులకు భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక ‘అర్జున అవార్డు’ ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ కు రావడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా బాక్సింగ్ లో వరుస విజయాలను నమోదు చేస్తూ, దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన నిఖత్ జరీన్ అర్జున అవార్డుకు నూటికి నూరు శాతం అర్హురాలని సీఎం అన్నారు. యావత్ భారత జాతి తెలంగాణ బిడ్డ ప్రతిభను చూసి గర్విస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు.

అలాగే టేబుల్ టెన్నిస్ క్రీడలో అత్యద్భుత ప్రతిభ కనబరిచిన తెలంగాణ బిడ్డ ఆకుల శ్రీజకు ప్రతిష్టాత్మక ‘అర్జున అవార్డు’ రావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఆకుల శ్రీజకు శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రతిభతో క్రీడారంగంలో శ్రీజ ఉన్నత స్థాయికి చేరుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =