ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఆర్టీపీసీఆర్ కరోనా టెస్ట్ ధరలు తగ్గింపు

Andhra Pradesh, AO Covid-19 test prices at private labs, AP Govt Reduces RT PCR Covid Test, AP Govt Reduces RT PCR Covid Test Prices, AP Govt Reduces RT PCR Covid Test Prices in Private Labs, COVID test price at private labs, Covid-19 test prices at private labs, Covid-19 test prices at private labs in AP, Govt Reduces RT PCR Covid Test Prices in Private Labs, Govt slashes RT-PCR test sample collection costs, Mango News, Private labs overcharging to fast-track Covid, RT PCR Covid Test Prices reduced, RT PCR Covid Test Prices reduced in AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా రోజువారీగా పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చిన ఎన్‌ఏబీఎల్ ప్రైవేట్ ల్యాబ్స్ లో కూడా కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ల్యాబ్స్ లో ఆర్టీపీసీఆర్ కరోనా పరీక్షలకు చెల్లించే ధరలను మరోసారి తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌ఏబీఎల్‌ ప్రైవేటు ల్యాబ్స్ లో ఆర్టీపీసీఆర్‌ ధరను రూ.350 గా నిర్ణయించారు. ఆర్టీపీసీఆర్‌ కరోనా పరీక్షల ధరలు తగ్గింపుపై మంగళవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పంపిన శాంపిల్స్ టెస్టుకు రూ.475, ఎన్‌ఏబీఎల్‌ ల్యాబ్‌లలో రూ.499 వసూలు చేస్తున్నారు. కాగా కొత్తగా నిర్ణయించిన ధరను అన్ని ఆసుపత్రులు, ల్యాబ్‌లలో కచ్చితంగా ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది. కరోనా టెస్టు ధరలు సరిగ్గా అమలు అయ్యేలా పర్యవేక్షించాలని జిల్లా వైద్యాధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 11 =