ఈ నెల 22న ర‌వీంద్ర భార‌తిలో ఉగాది వేడుక‌లు, ముఖ్య అతిధిగా సీఎం కేసీఆర్, సీఎస్ కు ఆహ్వాన పత్రిక అందజేత

Ugadi Celebrations at Ravindra Bharati on 22nd: Director of Cultural Dept Mamidi Harikrishna Handed over Invitation to CS Santhi Kumari,Ugadi Celebrations at Ravindra Bharati on 22nd,Director of Cultural Dept Mamidi Harikrishna,Ugadi Invitation to CS Santhi Kumari,Mango News,Mango News Telugu,Cultural Dept Mamidi Harikrishna News Today,Santhi Kumari Reviews Ugadi Celebrations,Ravindra Bharati Ugadi Celebrations News,Ravindra Bharati Ugadi Celebrations Updates,CS Santhi Kumari Latest News,CS Santhi Kumari Latest Updates,Ravindra Bharati Latest News

మార్చి 22వ తేదీన రవీంద్రభారతిలో నిర్వహించనున్న “శ్రీ శోభకృత్ నామ సంవత్సరం (ఉగాది)” ఉత్సవాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఉగాది పండుగ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లపై ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి అధికారులతో సమీక్ష జరిపారు. కాగా శ్రీ శోభకృత్ నామ నూతన సంవత్సర ఉగాది వేడుకల ఆహ్వాన పత్రికను సోమవారం రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ సీఎస్ శాంతి కుమారి కి బీఆర్కేఆర్ భవన్ లో అందచేశారు. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని సీఎస్ ను శాలువాతో సన్మానించారు. ఈనెల 22న రవీంద్ర భారతిలో జరిగే ఉగాది పర్వదిన వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముఖ్య అతిధిగా హాజరవుతారని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here